యానిమల్‌..సాంగ్ రిలీజ్

43
- Advertisement -

రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్ రెడ్డి వంగా మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘యానిమల్’ చార్ట్ బస్టర్ ఆల్బమ్ తో సెన్సేషన్ సృష్టించింది. మ్యూజిక్ కీలక పాత్ర పోషించనున్న ఈ చిత్రంలోని ఇప్పటికే విడుదలైన “అమ్మాయి”, “నే వేరే ” పాటలు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ ప్రశంసలు అందుకున్నాయి.

తాజాగా మేకర్స్ ఈ యానిమల్ నుంచి “నాన్న నువ్ నా ప్రాణం” పాటని విడుదల చేశారు. రణ్‌బీర్‌, అనిల్ కపూర్ పాత్రల మధ్య చిత్రీకరించిన ఎమోషనల్ బాండింగ్ ఈ పాట అద్భుతంగా మనసుని హత్తుకునేలా చూపించింది. ట్యాలెంటెడ్ సింగర్ సోనూ నిగమ్ మెస్మరైజింగ్ గా ఆలపించిన ఈ పాటలో రణబీ, అనిల్ కపూర్ పాత్రల యొక్క కాంప్లెక్స్ లేయర్స్ ని ప్రజెంట్ చేస్తూ త్రండీ కొడుకుల బంధాన్ని అందంగా చిత్రీకరిస్తుంది.

టీజర్ తండ్రికొడుకుల అనుబంధం యొక్క సంక్లిష్టతను సూచిస్తే.. ఈ పాట వారి పాత్రల డైనమిక్స్ ని మరింత ఇంటెన్స్ గా చూపించింది. హిందీ వెర్షన్‌తో పాటు, “నాన్న నువ్వు నా ప్రాణం” పాట తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదలై ప్రేక్షకులను గొప్పగా ఆకట్టుకుంది.

భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ టి-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ పై ‘యానిమల్‌’ ప్రతిష్టాత్మకంగా రూపొందింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచుసున్న ఈ క్రైమ్ డ్రామా డిసెంబర్ 1, 2023న గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read:Revanth Reddy:రేవంత్ రెడ్డి టీడీపీ కోసమేనా?

- Advertisement -