తెలుగు తెర పై క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి, ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయేలా ఉంది. తెలుగులో ఈ అమ్మడికి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. అందుకు కారణం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో వైపు ఈమెకు తమిళంలో కూడా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా మీనాక్షి చౌదరి ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. మీడియా వారు ఆమె ప్రేమ గురించి, పెళ్లి గురించి ప్రశ్నించగా, మీనాక్షి తనదైన శైలిలో స్పందించి అందరిని ఆశ్చర్యపర్చింది.
‘మీనాక్షి చౌదరి’తో మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ?, అసలు పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటీ ? అంటూ ప్రశ్నించారు. దానికి ‘మీనాక్షి చౌదరి’ స్పందిస్తూ… నా సినీ కెరీర్ లో విజయవంతం అవ్వడం కోసం నేను ప్రస్తుతం చాలా కష్టపడుతున్నాను. అందుకే, నా జీవితంలో పెళ్లి అనే ట్యాగ్ ను నేను త్వరగా వేసుకోవాలని అనుకోవడం లేదు’ అంటూ మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది. ‘మీనాక్షి చౌదరి’ ఇంకా చాలా చిన్న పిల్ల అట. ఆమె పెళ్లి చేసుకోవడానికి మరో పదేళ్లు సమయం ఉందని ఆమె తల్లి కూడా కామెంట్స్ చేసిందట. ప్రస్తుతం ‘మీనాక్షి చౌదరి’ తాను బాగా స్థిరపడాలని ప్రయత్నాలు చేస్తోందట.
ప్రస్తుతానికి అయితే, మీనాక్షి చౌదరికు వచ్చే సంపాదన విషయంలో ఆమె కుంటుంబం ఇంకా పూర్తి సంతోషంగా లేదట. కాబట్టి.. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి ? అంటూ ‘మీనాక్షి చౌదరి’ మాట్లాడుతుంది. మొత్తానికి ‘మీనాక్షి చౌదరి’ వ్యాఖ్యలు చూస్తుంటే.. ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా లేదు. ఓ యంగ్ హీరోతో గత కొంత కాలంగా ఈ కుర్ర బ్యూటీ ప్రేమలో ఉందని కూడా టాక్ నడుస్తోంది. తన ప్రేమ కారణంగా… తన పెళ్లి త్వరలో జరుగుతుందని ప్రచారం చేస్తారనే భయంతోనే… ‘మీనాక్షి చౌదరి’ పై విధంగా కామెంట్స్ చేసి ఉండొచ్చు.
Also Read:Revanth Reddy:రేవంత్ రెడ్డి టీడీపీ కోసమేనా?