మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో దీపావళి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు మనోజ్, సతీ సమేతంగా చిరంజీవి ఇంటికి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అందరూ కలిసి ఇలా దీపావళి చేసుకోవడం గొప్ప విషయం. అందుకే, ఫ్యాన్స్ అందరూ కలిసి ఈ పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. అన్నట్టు దీపావళి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కొత్త జంట వరుణ్, లావణ్యల దీపావళి సెలబ్రేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ముందుగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. దీపావళి సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబం అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ తమ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. అయితే, ఈ ఫోటోలో అందరి కళ్లు ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ పైనే ఉన్నాయి. ఎందుకంటే భార్గవ్ చాలా అల్లరని, అతడి అల్లరిని భరించడం చాలా కష్టమని ఎన్టీఆర్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. పైగా భార్గవ్ రామ్ కి సీనియర్ ఎన్టీఆర్ పోలికలు ఉండటంతో అతని పై ఫ్యాన్స్ మరింత ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక మరోవైపు మెగా ఫ్యామిలీలో కోడలిగా అడుగుపెట్టిన లావణ్యకు ఇదే మొదటి దీపావళి. దీంతో ఈ పండగను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను వరుణ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్నారు. లైట్ పర్పుల్ కలర్ చీరలో లావణ్య.. డిజైనర్ కుర్తాలో వరుణ్, బ్లూ కలర్ హుడీలో నాగబాబు కనిపించగా.. రెడ్ కలర్ చీరలో నీహారిక మెరిసిపోయారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దీపావళీ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read:వింటర్‌లో చర్మ సౌందర్యానికి చిట్కాలు!