మునుగోడులో కాంగ్రెస్ భూస్థాపితమేనా?

62
- Advertisement -

ఒకప్పుడు కాంగ్రెస్ కు అడ్డాగా ఉన్న మునుగోడు నియోజిక వర్గంలో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయా ? అక్కడ హస్తం పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతుందా ? అంటే తాజా పరిణామాలను చూస్తే నిజమేనేమో అనే సందేహాలు రాక మానవు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ పార్టీలోని అంతర్గత కుమ్ములాటల కారణంగా ఆయన గత ఏడాది తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. అయితే ఆ తరువాత జరిగిన బైపోల్ లో నియోజికవర్గ ప్రజలు కే‌సి‌ఆర్ సుపరిపాలనకు మద్దతుగా నిలిచి బి‌ఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. ఇక ఆ ఉప ఎన్నికల్లో అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు గట్టిగానే బుద్ది చెప్పారు నియోజకవర్గ ప్రజలు. మునుగోడులో తనకు తిరుగులేదని పగటి కలలు కన్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఘోర ఓటమిని కట్టబెట్టారు.

ఇక కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతికి అసలు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. దీన్ని బట్టి కాంగ్రెస్ బీజేపీలను నియోజకవర్గ ప్రజలు ఎంతలా ద్వేసిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ వీడి బి‌ఆర్‌ఎస్ లో చేరారు. దీంతో హస్తం పార్టీ పూర్తిగా డీలా పడింది. బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే టికెట్ కేటాయించడం తో నియోజక వర్గంలోని చాలా మంది కాంగ్రెస్ నేతలు అధిష్టానం తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆల్రెడీ నియోజక వర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజా మద్దతు కరువైంది. ఇప్పుడు హస్తం పార్టీకి బలంగా ఉన్న పాల్వాయి స్రవంతి కూడా ఆ పార్టీ వీడడం తో కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మొత్తానికి ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న మునుగోడులో ఇప్పుడు ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. మరి ఈసారి ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ విజయంతో మునుగోడులో కాంగ్రెస్ భూస్థాపితం కావడం గ్యారెంటీ అని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:సబ్జా గింజలు..ఔషధ గుణాలు

- Advertisement -