BJP:అంతా కోటీశ్వరులే గురూ!

45
- Advertisement -

బీజేపీలో ఉన్న నేతలంతా కోటీశ్వరులే అని మరోసారి రుజువైంది. తెలంగాణ ఎన్నికల వేళ కమలనాథుల స్థిర చర ఆస్తులు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. నామినేషన్ వేసిన మెజారిటీ నేతలందరూ కూడా కోట్లకు పడగ విప్పిన వారే అఫిడవిట్లే తేల్చి చెబుతున్నాయి. అత్యంత సంపన్నమైన నేతల్లో శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయబోతున్న బీజేపీ నేత రవి కుమార్ ఆస్తి అఫిడవిట్ లో తెలిపిన వివరాల ప్రకారం రూ.166.93 కోట్లు గా ఉందట.

ఇక కోరుట్ల నుంచి పోటీ చేయచేస్తున్న ధర్మపురి అరవింద్ ఆస్తి రూ. 107.43 కోట్లుగా ఉంది. సనత్ నగర్ నుంచి పోటీ చేస్తున్న శశిధర్ రెడ్డి రూ.51.14 కోట్లు, హుజూరాబాద్ మరియు గజ్వేల్ నుంచి పోటీ చేయబోతున్న ఈటెల రాజేందర్ రూ. 53.94 కోట్లు, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న వెంకటరమణ రెడ్డి రూ. 49.71 కోట్లు, మంచిర్యాల నుంచి బరిలో ఉన్న రఘునాథరావు రూ. 48.18 కోట్లు, సుభాష్ రెడ్డి ( ఎల్లారెడ్డి ) రూ.42.55 కోట్లు, కాళిప్రసాద్ ( పరకాల ) రూ.39.88 కోట్లు, మోహన్ రెడ్డి ( బోధన్ ) రూ.38.68 కోట్లు.

ఇలా కమలం పార్టీలోని మూడో వంతు నేతలు కోట్లకు పడగ విప్పినవారే కావడంతో ఈ స్థాయిలో ధన సంపద వారికెలా వచ్చిందనే టాక్ రాష్ట్రరాజకీయాల్లో మొదలైంది. అటు కాంగ్రెస్ లో కూడా దాదాపు ఇదే స్థాయిలో కోటీశ్వరులు ఉండడం గమనార్హం. మరి రెండు పార్టీలలోనూ ధనమొహంతో ఉన్న నాయకులు ప్రజా గోడును పట్టించుకునేడెప్పుడు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడిచినప్పటికి బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు చేసిన దోపిడి అంతా కాదు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల వేళ ఈ రెండు పార్టీల నేతల యొక్క ఆస్తులు బయట పడుతుండడంతో ఆ వివరాలు చూసిన ప్రజానీకం నోరెళ్ళబెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ధన వ్యామోహం తో ఉన్న నేతలకు ప్రజలు బుద్ధి చెబుతారని రాజకీయ అతివాదులు చెబుతున్నారు.

Also Read:చెడుపై విజయమే… దీపావళి

- Advertisement -