జూనియర్ ఎన్టీఆర్ అతిధి పాత్రల్లో నటిస్తున్నారు అంటూ చాలా రోజుల నుంచి చాలా రకాల పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా, మళ్లీ అలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ `టైగర్ 3`. ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలో కూడా అతిథి పాత్రల విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ యూనివర్స్‌లో భాగంగానే రూపొందుతున్న ‘వార్ 2’లో హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించనున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ‘టైగర్ 3’తోనే ఆయన పాత్రని పరిచయం చేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మరి ‘టైగర్ 3’లో ఎన్టీఆర్ నిజంగానే కనిపిస్తారా? చూడాలి. ఇక ఎన్టీఆర్ పై మరో పుకారు విషయానికి వస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి. అయితే ఇప్పుడు గుంటూరు కారం మూవీకి సంబంధించిన వార్త నెట్టింట్లో హల్ చల్ అవుతుంది.
ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు టాక్ నడుస్తుంది. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. మరి మహేష్ ‘గుంటూరు కారం’లో ఎన్టీఆర్ నటిస్తే.. ఫ్యాన్స్ కి ఆ కెక్కే వేరు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఏప్రిల్ 4న పార్ట్1 రిలీజ్ కానుంది. అన్నట్టు ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు.
Also Read:టాలీవుడ్ చంద్రమోహన్ ను అవమానించిందా?

