టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినీ ప్రముఖులు ఆయనను తలుచుకొని తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఆయన బతికినంత కాలం ఇదే సినీ పెద్దలు ఆయనకు సరైన రితీలో గౌరవం ఇవ్వలేదని.. ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహనే స్వయంగా చెప్పుకుని కలత చెందిన సంఘటన నేటికీ యూట్యూబ్ లో సజీవంగానే ఉంది. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఓ సినిమాలో చంద్రమోహన్ ఓ కీలక పాత్రలో నటించారు. కొన్ని అనారోగ్య కారణాలు కారణంగా చంద్రమోహన్ షూటింగ్ కి లేటుగా వచ్చారు. ఆ సమయంలో దిల్ రాజు ఆయన పట్ల ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. సీనియర్ నటులు అని కనీస మర్యాద కూడా లేకుండా దిల్ రాజు, చంద్రమోహన్ మొహం మీదే చాలా హేళనగా మాట్లాడారట.
పాపం ఆ చంద్రమోహన్ ఆ సంఘటనను మర్చిపోలేక చివరి రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా ఈ విషయాన్నే చెప్పుకుని బాధ పడ్డారు. ఇక మన స్టార్ హీరోల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నిజానికి చంద్రమోహన్ కూడా అప్పట్లో ఓ హీరోనే. అయినప్పటికీ.. నేటి హీరోలు మాత్రం ఆయనను ఓ మాజీ హీరోగా గౌరవించే వారు కాదు. పైగా సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయనకు సరైన గుర్తింపును ఇవ్వలేదు. నిజానికి ఆయన ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు.
ఇంకా చెప్పాలంటే.. చంద్రమోహన్ గారు 175 సినిమాల్లో హీరోగా నటించారు. నేటి స్టార్ హీరోలు ఎవరూ ఇంకా మార్క్ ను దాటలేదు. అలాగే ఆయన 2 ఫిలింఫేర్, 6 నంది అవార్డులను అందుకున్నారు. పైగా 1987లో చందమామ రావే సినిమాకు ఉత్తమ కమెడియన్‌గా నంది అవార్టు కూడా అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా చంద్రమోహన్ కీలక పాత్రలు పోషించారు.
Also Read: భారీ బడ్జెట్‌తో ఇళయరాజా బయోపిక్!