‘సమంత’ హాట్ ఫొటో పై రచ్చ

37
- Advertisement -

స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. బజార్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం సామ్ ఆ హాట్ ఫొటో దిగింది. ఈ ఇంటర్వ్యూలో సామ్ మాట్లాడుతూ, గత రెండేళ్లుగా నేనెంతో కుంగుబాటుకు గురయ్యాను. ఆ సమయంలో నేను ఎంతోమంది నటీనటుల గురించి చదివాను. సినిమా సెలబ్రిటీల జీవితాలు అంటే హిట్స్, అవార్డులే కాదు. వారికి కష్టాలు, బాధలు ఉంటాయని సమంత చెప్పుకొచ్చింది. అన్నట్టు ‘సమంత’ కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

దానికొరకు భూటాన్‌ హాట్‌ స్టోన్‌ బాత్‌ ని సమంత ఫాలో అవుతుంది. అయితే ఈ ఆచారం భూటాన్లో వేల ఏళ్ల క్రితం నుంచే ఉందని, భూటాన్‌ ప్రజలు దీన్ని స్టోన్‌ బాత్‌ గా ఆచరిస్తున్నారని, నదులలోని రాళ్లను ఎర్రగా కాల్చి నీటిలో వేస్తారని, వాటిలోని మినరల్స్ కరిగి భూటానీస్‌ హాట్‌ టబ్‌లోకి చేరుతాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం భూటాన్‌ లో చికిత్స తీసుకుంటున్న సమంత, త్వరలోనే కేరళ వెళ్లనుంది. అక్కడ కూడా ఓ ప్రత్యేక చికిత్స తీసుకుంటుందట. మొత్తానికి సమంత తన ఆరోగ్యం పై పూర్తిగా శ్రద్ధ పెట్టింది. దీనికోసం ఏడాది పాటు సినిమాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.

అయితే, సమంత హాట్ స్టిల్స్ పై కొందరు నెటిజన్లు చాలా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత మరీ ఇంతగా ఎందుకు దిగజారి పోతుంది?, అసలు ఆమెకు ఏమైంది ? అంటూ ఆమె యాంటీ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ దిగ్భ్రాంతికి గురి చేస్తాయని.. సమంత తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఇప్పటికే ఇలాంటి కామెంట్స్ విషయంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని.. అయినా కొందరు మాత్రం తమ బుద్దిని మార్చుకోవడం లేదని సామ్ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తానికి సమంత ఎక్స్ పోజింగ్ పై రచ్చ షురూ అయ్యింది.

Also Read:థ్యాంక్స్ చెప్పిన హాట్ బ్యూటీ

- Advertisement -