Bigg Boss 7 Telugu:యావర్‌కి బూస్ట్ ఇచ్చిన సుజా అహ్మద్

66
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 68 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో సైతం ఫ్యామిలీ వీక్ కంటిన్యూ అవుతోంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా యావర్ బ్రదర్ సుజా అహ్మద్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మేరా బచ్చా.. కైసే హూ అంటూ యావర్‌ని పట్టుకొని ఎమోషనల్ అయిపోయాడు సుజా అహ్మద్. త శివాజీని గట్టిగా పట్టుకొని అన్నా మీరు తనతో ఉన్నారు మీరు కూడా నాకు బ్రదర్ అంటూ ఎమోషనల్‌ అయిపోయాడు.

యావర్‌ని పక్కకి తీసుకెళ్లి బూస్ట్ లాంటి మాటలు చెప్పాడు. నువ్వు ఫైటర్ గుర్తు పెట్టుకో.. టైగర్.. ఆటలో పక్కకి ఉండకు..నీ అమాయకత్వం, నీ ప్రేమ అసలు వదులుకోకు.. చాలా ముందుకు వెళ్తావ్ నువ్వు.. నువ్వు ఎక్కడా దారి మారకు అంటూ హితబోద చేశాడు. తన బ్రదర్‌ని పట్టుకొని అమ్మ గుర్తొస్తుంది అంటూ ఏడుస్తూనే ఉన్నాడు యావర్.

ఇక వెళ్లిపోయేటప్పుడు కూడా యావర్‌ని మోటివేట్ చేశారు. అందరూ కాన్సట్రేషన్‌గా ఉన్నారు ఒక్క నువ్వు తప్ప.. ముందు చూసిన యావర్ నాకు కనబడట్లేదని చెప్పాడు. ఎవరైతే జానాలు ఇష్టపడ్డారో ఆ యావర్‌లా ఉండు..సుజా అహ్మద్ బ్రదర్ ఆఫ్ యావర్ అహ్మద్ అని గర్వంగా చెబుతున్నాను అంటూ చెప్పి వెళ్లిపోయాడు.

Also Read:టాలీవుడ్ ఇంటరాగేటివ్ ఫిల్మ్.. “ది ట్రయల్”

- Advertisement -