‘భగవంత్ కేసరి’తో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య, తన తర్వాతి సినిమాను బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిన్న నుంచే మొదలైంది. కాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. NBK109కు అనిరుధ్‌ను ట్రై చేస్తున్నప్పటికీ, అతను ఖాళీగా లేకపోవడంతో దేవీ శ్రీ ప్రసాద్‌ను తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నట్లు సమాచారం. నిజానికి, బాలయ్య సినిమాలకు థమన్ అయితే బాగుంటుంది అని నందమూరి అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. అఖండ సినిమాకు థమన్ కొట్టిన మ్యూజిక్ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అందుకే, బాలయ్య కొత్త సినిమాకు కూడా థమన్ నే తీసుకోండి అంటూ బాలయ్య ఫ్యాన్స్ మేకర్స్ ను కోరుతున్నారు. కానీ, థమన్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. పైగా గత కొన్ని సినిమాలుగా థమన్ నుంచి సాలిడ్ మ్యూజిక్ రావడం లేదు. ముఖ్యంగా రామ్ హీరోగా వచ్చిన స్కంద సినిమాలోని నేపథ్య సంగీతం అసలు బాగాలేదు అని విమర్శలు వచ్చాయి. అందుకే, దర్శకుడు బాబీ థమన్ పై ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలోనే బాలయ్య – బాబీ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ఫైనల్ అయ్యాడు. దేవి కూడా మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. దేవి నుంచి మ్యూజిక్ లో మునపటి పదును కనిపిస్తోంది.
బహుశా అందుకే కావొచ్చు, బాలయ్య కూడా దేవి పైనే భారం వేశాడు. అటు దేవి శ్రీ ప్రసాద్ కూడా బాలయ్య సినిమా కోసం సరికొత్త బాణీలు ఇవ్వడానికి కసరత్తులు చేస్తున్నాడు. ఇక తమ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లు చిత్ర బృందం నిన్న ఓ పోస్ట్ పెట్టింది. ‘బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్’, ‘వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్’ అంటూ పోస్టర్ విడుదల చేసింది. రాజకీయ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర ఈ సినిమాకి నిర్మాతలు కావడం విశేషం.
Also Read:సిరిసిల్లలో కేటీఆర్..సిద్దిపేటలో హరీశ్ నామినేషన్లు