టాలీవుడ్‌లో ఉవ్వెత్తిన ఎగసిపడిన కెరటం -తరుణ్. `నువ్వే కావాలి` లాంటి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌తో ఇండస్ట్రీలో హీరోగా ఎంటరై, అటుపై పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి చాక్లెట్‌బోయ్‌గా, లవర్‌బోయ్‌గా వెలిగిపోయాడు. ఈ యంగ్ ట్యాలెంటెడ్ హీరో ఓ కొత్త సినిమాతో తిరిగి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు వస్తున్నాడు అనగానే ఫ్యాన్స్‌లో ఒకటే ఎగ్జయిట్‌మెంట్.
కాస్తంత గ్యాప్ తీసుకున్నా.. తరుణ్ ఇన్నాళ్టికి ఓ డ్రీమ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. `ఇది నా లవ్ స్టోరి` అనే టైటిల్‌ని, ఫస్ట్‌లుక్‌ని ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌లో తరుణ్ లుక్ కొత్తగా ఉంది. గుబురు గడ్డంతో ప్రేమికుల తత్వం తెలియజేసే తాత్వికుడిలాగా ఇంట్రెస్టింగ్‌గా కనిపించాడు. సేమ్ టైమ్ మూడు విభిన్నమైన గెటప్పుల్లో తనని తాను ఆవిష్కరించుకున్నాడు. మరోసారి చాక్లెట్‌బోయ్ లుక్‌లో రీఫ్రెషింగ్‌గా, కొత్తగా కనిపిస్తున్నాడంటూ ప్రశంసలొచ్చాయి. కామన్ ఆడియెన్‌తో పాటు, పరిశ్రమ ప్రముఖులు తరుణ్ లుక్ బావుందంటూ ప్రశంసించారు. అంతేకాదు..
తరుణ్ ఈసారి తప్పకుండా పెద్ద విజయం సాధించబోతున్నాడని, గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని చెప్పుకుంటున్నారంతా. కింగ్ నాగార్జున చేతులమీదుగా ఆవిష్కరించిన టీజర్‌కి చక్కని ప్రశంసలొచ్చాయి. తాజాగా ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో 10లక్షల వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా తరుణ్ తన అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.తరుణ్ సరసన ఈ చిత్రంలో ఓవియ హెలెన్ నటించారు. రమేష్ గోపి ఈ చిత్రానికి దర్శకత్వంలో ఎస్ వి ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనాథ్ విజయ్ స్వరాలు అందించారు.