తెలంగాణ నామినేషన్ల పర్వం తుదిదశకు చేరుకుంది. రేపు నామినేషన్లకు చివరి తేది కాగా ఇవాళ బీఆర్ఎస్ ముఖ్య నేతలు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్ లోని సమీకృత భవనంలో రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు కేసీఆర్. నామినేషన్ అనంతరం ఆయన ప్రచార వాహనం పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు.
ఇక సిరిసిట్లలో కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు నామినేషన్ దాఖలు చేశారు. సిరిసిల్లలో ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కేటీఆర్. కొత్త ప్రభాకర్ రెడ్డి అంబులెన్స్‌లో వెళ్లి వీల్‌ఛైర్‌లో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ నుంచి బీజేపీ నేతలు ఈటల, భట్టి కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు శుభదినం కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తుండగా 30న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read:‘రాజమౌళి’ని వదిలేసి రిస్క్ చేశాడా?