సైలెంట్ గా వచ్చి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ టాప్ హీరోల అందరి సరసన నటిస్తూ బడా ఇమేజ్ అందుకుంది ఈ గ్లామర్ బ్యూటీ. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా తన అభినయంతో ఆకట్టుకుని అగ్ర హీరోయిన్గా ఎదిగింది ఈ బ్యూటీ. సినిమా సినిమాకీ తన గ్లామర్ పెంచుతూ .. కొత్త కొత్తగా ముస్తాబవుతున్న రకుల్ మకుటం లేని మహారాణిగా రాణిస్తోంది. ఇటు టాలీవుడ్‌తో పాటు తమిళ ఇండస్ట్రీ నుంచి వరుస ఆఫర్లతో ఈ అమ్మడు బిజీగా ఉంది. ఓ వైపు సినిమాలతో మరోవైపు వ్యాపార విస్తరణతో క్షణం తీరికలేకుండా గడుపుతోంది రకుల్.
ఈ సందర్భంగా ఓ మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన రకుల్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.నేను అన్ని రంగాల్లోనూ రాణించాలన్నది మా పేరెంట్స్ కోరిక! ముఖ్యంగా మా మదర్ ఈ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉండేది. నా షెడ్యూల్ అంతా తనే చూసుకునేది. ఈ కారణంగా ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నా కూడా టెన్షన్ అనిపించదు. కూల్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతానని తెలిపింది.
మొదటి సినిమా తర్వాత అంతా గోల్డెన్ లెగ్ అన్నారని కానీ రెండు సినిమాలు సరిగ్గా ఆడకపోయేసరికి ఐరెన్‌లెగ్ అన్నారు. ఇప్పుడు తిరిగి గోల్డెన్ లెగ్ అంటున్నారని తెలిపింది. తనకు జయాపజయాలతో సంబంధం లేదని వాటిని పట్టించుకోనని తెలిపింది. ఓ సినిమా సక్సెస్ అయినా, ఫ్లాప్ అయినా దానికి బోలెడన్ని కారణాలుంటాయి. సక్సెస్‌కి పొంగిపోయి నేనే కారణం అనుకోను. అలాగే నా వలనే ఫ్లాప్ అయిందని బాధపడుతూ కూర్చోనని చెప్పింది.
మొదట నాకు వివాహవ్యవస్థ మీద గౌరవం ఉంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో సంతోషం ఎక్కువగా ఉంటుంది. అది మా పేరెంట్స్‌ని చూసి తెలుసుకున్నాను. నా విషయానికి వస్తే ఎలాంటి మ్యారేజ్ చేసుకోవాలి అన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. బోలెడు టైముంది కదా! అప్పటి నిర్ణయం అప్పుడు తీసుకుంటాను. డేటింగ్ చేయాల్సి వస్తే అన్న ప్రశ్నకు బదులిచ్చిన బ్యూటీ రణవీర్ సింగ్ అంటే తనకు ఇష్టమని అతనికి వీరాభిమానని తెలిపింది.
సినిమాలతో పాటు తాను ప్రారంభించిన బిజినెస్ బ్రహ్మాండంగా ఉందని త్వరలోనే మరో రెండు శాఖలు ప్రారంభించే ఆలోచన ఉందని అదంతా మా ఫ్యామిలీ చూసుకుంటుందని వెల్లడించింది. బ్రహ్మాండంగా ఉంది. మరో రెండు శాఖలు ప్రారంభించే ఆలోచన ఉంది. అదంతా మా ఫ్యామిలీ చూసుకుంటూంది. నా పర్యవేక్షణ అంతంతం మాత్రమే!
ఏపని చేసినా కరెక్ట్‌గా చేయాలి అన్నది నా ఫిలాసఫీ అని అలాగే టైం పంక్చు్యాలిటీ కూడా అన్న రకుల్ ఇవన్నీ తన ఫాదర్ నుంచి నేర్చుకున్నానని తెలిపింది. అందుకే షూటింగ్ స్పాట్లో అందరికన్నా నేనే ముందు ఉంటాను. నా తరువాతే ఒక్కొక్కరూ వస్తుంటారంది.
స్టయిల్‌కీ, గ్లామర్‌కి చాలా డిఫరెన్స్ ఉందని నా అభిప్రాయం. నేను చేసిన సినిమాల్లో చాలా వరకూ పల్లెటూరి అమ్మాయి పాత్రలే చేశాను. రెండు మూడు సినిమాలు స్టయిలిష్గాఝ ఉండే పాత్రలు చేసాను. ఆ పాత్రలకి మోడ్రన్ డ్రస్సులు వేసుకోవాలి. అంత దానికే గ్లామర్ హీరోయిన్ అనడం సమంజసం కాదేమోనని తెలిపింది.