జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్‌..కొత్త లారెన్స్‌ను చూస్తారు

32
- Advertisement -

రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన హై యాక్ష‌న్ డ్రామా ‘జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్‌’ దీపావ‌ళి సందర్బంగా ఈ మూవీ న‌వంబ‌ర్ 10న రిలీజ్ అవుతుంది. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని కార్తీకేయ‌న్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మేక‌ర్స్ తమిళ్‌, తెలుగు, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు…

రాఘ‌వ‌ లారెన్స్ మాట్లాడుతూ .. కార్తీక్ సుబ్బ‌రాజ్‌గారిపై న‌మ్మ‌కంతో ఈ సినిమాను చేయ‌టానికి రెడీ అయ్యాం. కాబ‌ట్టి ఎలాంటి టెన్ష‌న్ లేదు. జిగ‌ర్ తండ సినిమానే నేను చేయాల్సింది. కానీ మిస్ అయ్యింది. దాంతో రెండో పార్ట్‌లో న‌టిద్దామ‌ని నేనే కార్తీక్ సుబ్బ‌రాజ్‌గారిని అప్రోచ్ అయ్యాను. అప్ప‌టికింకా క‌థ రెడీ కాలేద‌ని ఆయ‌న అన్నారు. క‌థ రెడీ కాగానే నాకు ఫోన్ చేశారు. డాన్స్‌, ఫైట్స్‌, యాక్ష‌న్స్ చేయాలంటే క‌ష్ట‌ప‌డాలి. కానీ మా డైరెక్ట‌ర్‌గారు అలాంటివేం చేయొద్ద‌ని చెప్పారు. అంత కంటే కావాల్సిదేముంటుంది. ఆయ‌న చెప్పిన‌ట్లే యాక్ట్ చేశాం అన్నారు. ఓ పీరియాడిక్ మూవీ ఇది. మంచి బ్యాక్‌డ్రాప్‌లో మూవీ ఉంటుందన్నారు.

సినిమాలో మంచి యాక్ష‌న్ పార్ట్‌తో పాటు సెకండాఫ్‌లో మంచి ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో కొత్త‌గా ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మీరు చూసిన రాఘ‌వ లారెన్స్‌ను కాకుండా కొత్త లారెన్స్‌ను చూస్తారన్నారు. డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్‌గారు ఏం చెప్పారో దాన్ని చేసుకుంటూ వెళ్లాం. ఎందుకంటే నేను కూడా డైరెక్ట్ చేశాను. మ‌నం డైరెక్ష‌న్ చేస్తున్న‌ప్పుడు మ‌రొక‌రు ఇన్‌వాల్వ్ అయితే ఒప్పుకోం క‌దా.. ఆ సంగ‌తి నాకు తెలుసు. కాబ‌ట్టి నేను కానీ, సూర్య‌గారు కానీ డైరెక్ష‌న్‌లో ఎక్క‌డా ఇన్‌వాల్వ్ కాలేదు. త్వ‌ర‌లోనే ముని 5, కాంచ‌న 4 మొద‌లు పెడుతున్నాను అని చెప్పారు.

Also Read:KCR:నారాయణపేట పచ్చబడాలే

ర‌జినీకాంత్‌గారి సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నానంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. దాని గురించి ఇప్పుడేం మాట్లాడ‌లేను. అన్నీ క‌రెక్ట్‌గా కుదిరితే మేక‌ర్స్ చెబుతారు.సూప‌ర్‌స్టార్‌గారికి, మెగాస్టార్‌గారికే కాదు.. ఇద్ద‌రూ క‌లిసి న‌టించేంత మ‌ల్టీస్టార‌ర్ స్క్రిప్ట్ కూడా నా ద‌గ్గ‌ర ఉందన్నారు. కరోనాకు ముందు చారిటీ ట్రస్ట్ పెడదామని అనుకున్నాను. కానీ కుదరలేదు. చారిటీకి సపోర్ట్ చేయాలనుకునే మంచి వ్యక్తులు దొరకాలి. లేకపోతే కష్టం. అలాంటి వ్యక్తుల కోసం సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఓ రాఘవేంద్రస్వామిగారి గుడి కట్టాలని అనుకుంటున్నాను. తప్పకుండా అన్నీ చేస్తాను అన్నారు.

ఎస్‌.జె.సూర్య మాట్లాడుతూ…. జిగ‌ర్ తండ సినిమాను కార్తీక్ సుబ్బ‌రాజ్‌గారు చేసేట‌ప్పుడు తెలుగులో అంత‌గా ట‌చ్ లేదు. దాంతో ఆయ‌న దాన్ని త‌మిళంలోనే రిలీజ్ చేసుకున్నారు. తెలుగులో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ పేరుతో రీమేక్ చేస్తే ఇక్క‌డ సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్ విష‌యానికి వ‌స్తే రాఘ‌వ లారెన్స్‌గారు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే కావ‌టంతో పాటు నేను కూడా బాగా తెలియ‌టంతో కార్తీక్‌గారు బాగా ఖ‌ర్చు పెట్టి సినిమా చేశారు.

జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్ సినిమాను వంద కోట్ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టి నిర్మించారు ప్రొడ్యూస‌ర్ కార్తికేయ‌న్‌. దీని కోసం ఓ కొండ పైన విలేజ్ సెట్ వేసి మ‌రీ చిత్రీక‌రించారు. జిగ‌ర్ తండ స‌క్సెస్‌ఫుల్ సినిమా కావ‌టంతో జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్ సినిమాపై అంచ‌నాలు ఎక్కువ‌గానే ఉంటాయ‌ని తెలుసు. అయితే ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ని రీచ్ అవుతామ‌ని అనుకుంటున్నాం అన్నారు. జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్ చిత్రంలో లారెన్స్‌గారు గ్యాంగ్‌స్ట‌ర్‌.. నేనేమో డైరెక్ట‌ర్ కావాల‌నుకుని యాక్ట్ చేసే వ్య‌క్తి. ఈ పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయిన‌ప్పుడు మ‌ళ్లీ డైరెక్ట‌ర్ పాత్ర‌లో న‌టించాలా? అని ఆలోచించ‌టం మొద‌లు పెట్టాను. రెండు రోజుల త‌ర్వాత ఆలోచించాను. స‌త్య‌జిత్‌రే సినిమాలోని రోల్‌లా నా రోల్ ఉంటుంద‌ని, అందులో యాక్ట్ చేయ‌టానికి పిలుస్తార‌ని తెలిసింది. అదొక గిఫ్ట్‌గా భావించి నేను ఓకే చెబుదామ‌ని అనుకునే లోపే నిర్మాత‌గారు నాకు ఫోన్ చేశారు. లారెన్స్ మాస్ట‌ర్‌కి మాస్‌లో మంచి ఇమేజ్ ఉంది. ఆయ‌న్ని జిగ‌ర్ తండ డబుల్ ఎక్స్ చిత్రంలో కార్తీక్‌గారు కొత్త‌గా చూపించారు.
మూవీలో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంది. నా డైరెక్ష‌న్‌లోనే నేను యాక్ట్ చేయాల‌నుకునే ప్లాన్‌లో ఉన్నాను. త్వ‌ర‌లోనే వివ‌రాల‌ను తెలియ‌జేస్తాను.

- Advertisement -