యాంకర్ బ్యూటీలు బిల్డప్ కామెంట్లు

48
- Advertisement -

జబర్దస్త్ యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రష్మీ గౌతమ్ ఆ క్రేజ్ తోనే కొన్ని చిన్న సినిమా ఛాన్స్ లు అందుకుంది. కాకపోతే, సినిమాల్లో చేస్తున్న పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. స్మాల్ స్క్రీన్ లో రష్మీ గౌతమ్ కి ఉన్న క్రేజ్.. వెండితెర పై మాత్రం లేకుండా పోయింది. పైగా సినిమాల్లో తనకు వస్తున్న పాత్రలతో రష్మీ గౌతమ్ కెరీర్ సంతృప్తికరంగా లేదట. హీరోయిన్ గా తనకు అవకాశాలు ఎందుకు రావడం లేదో తనకు కావడం లేదు అని రష్మీ గౌతమ్ అంటుంది. తాను ఏ దర్శకుడికి ఫేవర్ గా ఉండను, ఏ నిర్మాత చుట్టూ తాను తిరగను అందుకే, తనకు పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు రాలేదని రష్మీ గౌతమ్ చెప్పుకొచ్చింది.

అంటే రష్మీ గౌతమ్ మాటల్లో అర్ధం ఏమిటి ?, షూటింగ్ తర్వాత పార్టీలకు వెళ్తే హీరోయిన్ గా అవకాశాలు వస్తాయని చెబుతుందా ?, సినిమా ఇండస్ట్రీలో నైట్ పార్టీలు జరుగుతుంటాయి, అలాంటి పార్టీలకు సహజంగా హీరోయిన్లు వెళ్తూ ఉంటారు. తను మాత్రం వాటికీ దూరంగా ఉంటానని రష్మీ గౌతమ్ మొత్తానికి తన గురించి బాగానే చెబుతుంది. హీరోయిన్ కావాలంటే పార్టీలకు తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి అన్న నియమం ఏమీ లేదు. గతంలో పార్టీలకు వెళ్లకుండా హీరోయిన్ గా సక్సెస్ అయినవారు చాలామంది ఉన్నారు.

హీరోయిన్ సాయి పల్లవి కూడా అలాంటి పార్టీలకు వెళ్ళదు కదా. ఎవరైనా మనసుకి నచ్చింది చేస్తానని నచ్చకపోతే చేయనని అంటారు. కానీ ఫలానా హీరోయిన్లు పార్టీలకు వెళ్తారు, నేను వెళ్లను అంటూ కోతలు కోయడం కరెక్ట్ కాదు. యాంకర్ అనసూయ కూడా ఇలాంటి కామెంట్సే చేసింది. ఇప్పుడు రష్మీ గౌతమ్ వంతు వచ్చింది. అయినా నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు ఎలాంటి పాత్రలకైనా సిద్ధమే అని చెబితేనే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి.

Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

- Advertisement -