కే‌సి‌ఆర్ భరోసా.. భవితకు ఆసరా!

38
- Advertisement -

దేశంలో అన్నీ రంగాల్లోనూ అగ్రగామిగా దూసుకుపోతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. మరే ఇతర రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమం ఒక్క తెలంగాణలోనే అమలౌతుండడం నిజంగా గర్వకారణం. పక్క రాష్ట్రాల్లో ఐదు గంటల కరెంట్ ఇవ్వడానికే ప్రభుత్వాలు నానా అగసట్లు పడుతుంటే తెలంగాణ ముఖమంత్రి కే‌సి‌ఆర్ తన పాలన దక్షత తో ఎక్కడ సాధ్యం కానీ విధంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తూ ఇతర పాలకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇక ఎన్నికల వేళ ఆచరణకు సాధ్యం కానీ హామీలను ప్రకటిస్తూ రాజకీయ పబ్బం గడిపేందుకు కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు ప్రయత్నిస్తుంటే.. బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ మాత్రం ” చెప్పిందే చేస్తాం.. చేసిందే చెప్తాం ” అన్న రీతిలో గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్దిని ప్రజల ముందు పెడుతూ.. మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిని స్పష్టంగా ప్రజలకు వివరిస్తూ నిజమైన నాయకుడిగా ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్నారు. .

ఈసారి ఆసరా పెన్షన్ల పెంపు, రైతు బంధు సాయం పెంపు, దివ్యాంగుల పెన్షన్ పెంపు.. వంటి వాటితో పాటు అన్నపూర్ణ పథకం, సౌభాగ్య లక్ష్మి పథకం, రూ. 400 లకే గ్యాస్ సిలిండర్, కే‌సి‌ఆర్ ఆరోగ్య రక్ష, మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు, అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్ళు, అసైన్డ్ భూముల పై ఆంక్షలు ఎత్తివేత.. ఇలా ప్రజల పట్ల భేదాభిప్రాయం లేకుండా అందరికీ సమానమైన రీతిలో సంక్షేమాన్ని అందించే విధంగా కే‌సి‌ఆర్ హామీలు ఉండడం హర్షించాల్సిన విషయం. దోపిడి లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించిన హామీలలో ఏ ఒక్కటైన ఆమోదానికి నోచుకునే అవకాశం ఉందా అంటే ప్రజలు కూడా నమ్మలేని పరిస్థితి. మొత్తానికి హామీల ప్రకటనలోనూ, అమలు విషయంలోనూ ముందు చూపుగా ఉన్న కే‌సి‌ఆర్ విజన్ పైనే రాష్ట్ర ప్రజల సుముఖంగా ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయం.

Also Read:ప్రతిరోజూ శనగలు తింటే ఎన్ని లాభాలో!

- Advertisement -