రాజశ్యామల యంత్రపూజలో కేసీఆర్‌ దంపతులు

43
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రమంతా రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో మార్మోగుతోంది. వేద మంత్రోచ్ఛారణల మధ్య యాగం నిర్విఘ్నంగా సాగుతోంది.

గురువారం రెండో రోజు యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శివకామసుందరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి అవతారానికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు ప్రత్యేక హారతులు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు రాజశ్యామల యంత్రానికి, సుబ్రహ్మణ్య షడావరణ యంత్రానికి పూజలు చేశారు.

పండితులు 11 సార్లు శూలినీ దుర్గ కవచ పారాయణ చేసారు. సర్వ లోక సంరక్షణార్ధం ఇంద్ర సూక్త హోమం, నవగ్రహ సూక్త హోమం కూడా నిర్వహించారు. మరోపక్క షడావరణ సహిత మూల మంత్రాలతో సుబ్రహ్మణ్య కవచ యాగం చేపట్టారు.

Also Read:KCR:ప్రజల చేతిలో వజ్రాయుధం ఓటు

- Advertisement -