దక్షిణాదిన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి నివేదా థామస్. చేసింది కొన్ని సినిమాలే అయినా అగ్రహీరోలతో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. రజనీ, పవన్ వంటి హీరోలతో నటించి మెప్పించారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో బిజీగా ఉన్న నివేదా…పుట్టిన రోజు నేడు.
2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా వెండితెరకు పరిచయమైంది. తర్వాత వెరుథె ఒరు భార్య సినిమాలో జయరం కుమార్తెగా నటించి మెప్పించగా ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. సముద్ర ఖని దర్శకత్వంలో వచ్చిన 2011లో పొరాలీలో పెట్రోల్ బంక్ ఉద్యోనిగా నటించి మెప్పించింది. జెంటిల్ మాన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నివేదా..ఈ సినిమాతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. తర్వాత నిన్నుకోరి, జైలవకుశ, 118, వకీల్ సాబ్ బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టింది. మలయాళ సినిమా వెరుథె ఒరు భార్య సినిమాతో కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం అందుకుంది.
కళ్లలతోనే అన్ని భావాలు పలికించే ఈ కేరళ కుట్టి 2020లో విడుదైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘దర్బార్’లో ఆమె నటించింది. ఇక నివేదా ఇలానే ప్రేక్షకులను మెప్పిస్తూ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.
Also Read:ఓటీటీలోకి వచ్చేసిన ‘స్కంద’