- Advertisement -
వినియోగదారుల నెత్తిన గుదిబండ మోపాయి చమురు కంపెనీలు. ప్రతీ 15 రోజులకోసారి సమీక్షలో భాగంగా సిలిండర్ ధరలను పెంచేశాయి. 19 కేజీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.100 పెరిగింది. అక్టోబర్‌లో 200 పెంచగా తాజాగా పెంచిన ధరతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ రేటు రూ. 1833కు చేరింది. అయితే 14.2 కేజీల సిలిండర్ రేటు మాత్రం స్థిరంగానే ఉంది.
కోల్‌కతాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1943గా ఉండగా ముంబైలో సిలిండర్ రేటు రూ 1785గా ఉండగా చెన్నైలో రూ. 1999గా ఉంది. ఈ సిలిండర్ రేటు చివరిగా ఆగస్ట్ నెల 30న తగ్గింది.
Also Read:హ్యాపీ బర్త్ డే..ఇలియానా
- Advertisement -