ఎన్నికల్లో ప్రజలు గెలవాలి..ప్రజాశక్తి గెలవాలన్నారు సీఎం కేసీఆర్. మిర్యాలగూడ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం…స్ధానిక ఎమ్మెల్యే భాస్కరరావుపై ప్రశంసలు గుప్పించారు. ప్రతి క్షణం మిర్యాలగూడ అభివృద్ధి కోసమే పరితపిస్తారన్నారు. భాస్కర్ రావుకు ఏదైనా న్యాయంగా చేయడమే అలవాటన్నారు. భాస్కర్ స్వయంగా ఒక రైతు అని…ఆయనకు అన్ని తెలుసన్నారు. రైతులు ఎలాంటి బాధకు గురి కావొద్దనే బాధ ఆయనలో కనిపిస్తుందన్నారు. కేసీఆర్ కళా భవన్ మిర్యాలగూడకే వన్నె తెచ్చిందన్నారు.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిందన్నారు. మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని ఓటు వేసే ముందు ఆ వ్యక్తిని చూడటంతో పాటు ఆ పార్టీ చరిత్ర ఏందో చూడాలన్నారు. ప్రజల గురించి ఆ పార్టీ ఆలోచన సరళి ఏంటో ఆలోచించి ఓటు వేయాలన్నారు.యువతదే ఈ దేశం.. ఈ రాష్ట్రం మీది.. భవిష్యత్ మీది..ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఏకైక ఆయుధం ఓటు..ఆలోచించి ఓటెయ్యండి… అభివృద్ధికి అండగా నిలవాలన్నారు.
50 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఏం చేయలేకపోయిందన్నారు.అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు.ఆనాడు నాగార్జున సాగర్‌లో నీటి విడుదల కోసం స్వయంగా ధర్నాలు చేసే పరిస్థితి నెలకొందని..కానీ నేడు స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. కృష్ణానదిలో ఈ సారి కూడా నీరు తక్కువ వచ్చాయని ఉన్నదాంట్లో నీటిని విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గోదావరి నది ద్వారా ఉదయ సముద్రానికి అక్కడి నుండి పెద్ద దేవుళపల్లికి నీటిని తీసుకొస్తామన్నారు. శాశ్వతంగా సాగర్ ఆయకట్టు రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్‌ది మొసలి కన్నీరు అన్నారు.
దళితుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ చేసింది శూన్యమన్నారు. దళిత బంధును సృష్టించిందే కేసీఆర్ అని తేల్చిచెప్పారు. దశల వారీగా దళితుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తున్నామన్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. ధాన్యం పండించడంలో పంజాబ్ తర్వాత రెండవస్థానంలో తెలంగాణ ఉందని… రాబోయే రోజుల్లో పంజాబ్ ను కూడా దాటేసి అగ్రస్థానంలో చేరుకుంటాం అన్నారు. కరెంట్ బాధను శాశ్వతంగా దూరం చేసుకున్నామన్నారు. భాస్కరరావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మిర్యాలగూడ అభివృద్ధి తనదన్నారు.
Also Read:మహేష్ ఫ్యాన్స్ కోసం పోస్టర్ మాత్రమే!