Bigg Boss 7 Telugu:సందీప్ మాస్టర్ ఎలిమినేట్

39
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు 8 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 7 వారాల్లో అమ్మాయిలు ఎలిమినేట్ కాగా తాజా వీక్‌లో సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. సందీప్ అసలు ఈ ఎలిమినేషన్ నేను ఊహించలేదు.. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని చెప్పారు నాగ్.

నామినేషన్స్‌లో మొదటి వారం నుంచి ఉంటే బయట ఒక ఫాలోయింగ్ వస్తుంది.. నీకిది ఫస్ట్ నామినేషన్ కదా అందుకే ఇలా అంటూ నాగార్జున చెప్పారు. వాస్తవానికి ఈ వారం శోభా కంటే సందీప్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. పైగా బిహేవియర్ విషయంలో కూడా సైకో శోభా కంటే 100 రెట్లు సందీప్ మాస్టర్ బెటర్. కానీ శోభాని కాపాడి సందీప్‌ని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్.

7 వారాలుగా వరుసగా అమ్మాయిలే ఎలిమినేట్ అవుతున్నారు.. ఒక్క మేల్ కంటెస్టెంట్ కూడా ఔట్ కాలేదు. దీంతో ఈ వారం కూడా అలా చేస్తే ఇంకా నెగిటివిటీ వస్తుందేమోనని భావించి సందీప్‌ని ఎలిమినేట్ చేశారు. ఈ వారం తాను ఎలిమినేట్ కాకుండా కాపాడిన ఆడియన్స్‌కి థ్యాంక్స్ అంటూ శోభా చెప్పింది.

Also Read:Congress:కాంగ్రెస్ కు బై బై.. నేతల వలసలు!

- Advertisement -