తెలంగాణ ఎన్నికల వేళ ఆ మద్య బీజేపీ మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్హ్తుల ప్రకటన తరువాత చాలమంది నేతలల్లో అసంతృప్త జ్వాలలు రేగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ వీడారు కూడా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక ఆయన దారిలోనే మరికొంత మంది నేతలు కూడా పార్టీకి బై బై చెప్పే ఆలోచనలో ఉన్నారట. మాజీ ఎంపీ వివేక్, కొండా విశ్వేశ్వర రెడ్డి, విజయశాంతిజ వారు కొత్త దారులు వెతుకుంటున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ మద్య విడుదల అయిన మొదటి లిస్ట్ లో వీరి పేర్లు కూడా లేకపోవడంతో వీరంతా కమలం పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని తెలుస్తోంది.
తాజాగా రేవంత్ రెడ్డితో బీజేపీ నేత వివేక్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఈ రెండు మూడు రోజుల్లో ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు తెలుస్తోంది. ఇక విజయశాంతి కూడా బీజేపీ విడితే కమలం పార్టీ పూర్తిగా డీలా పడే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంచితే ఆల్రెడీ సీటు దగ్గిన వారిలో కూడా ఓటమి భయం వెంటాడుతోందట. గజ్వేల్ బరిలో ఉన్న కేసిఆర్ కు పోటీగా ఉన్న ఈటెల రాజేందర్, అలాగే కరీంనగర్ బరిలో ఉన్న బండి సంజయ్ వంటివారికి ఓటమిని ముందే అంగీకరిస్తున్నట్లు సమాచారం.
గజ్వేల్ బరిలో అధినేత కేసిఆర్ ను ఢీ కొట్టి నిలవడం అంతా ఈజీ కాదు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఒత్తిడి కారణంగానే ఈటెల రాజేందర్ కేసిఆర్ కు పోటీగా బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఓటమి ఖాయమే అని తెలియడం వల్ల తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందనే భయంలో ఈటెల ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన కూడా బీజేపీ వీడి ఇండిపెండెంట్ గా హుజూరాబాద్ లో మాత్రమే పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కమలం పార్టీలోని నేతలందరిలో ఓటమి భయం గట్టిగానే కనిపిస్తోంది.
Also Read:World Cup 2023:మనల్నెవడ్రా.. ఆపేది!