కాంగ్రెస్ తడిగుడ్డతో గొంతు కోసింది:సరస్వతి

47
- Advertisement -

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ లో అసమ్మతి రాజుకుంది. ఆసిఫాబాద్ టికెట్ శ్యామ్ నాయక్‌కు కేటాయించింది అధిష్టానం. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నాయకురాలు ముర్సుకొల సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ లోని తన ఇంట్లో అనుచరులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ పార్టీని నమ్మించి నన్ను తడి గుడ్డతో గొంతు కోసిందని…దొంగలకు టికెట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులను కాదని వేరే నియోజకవర్గ వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం చాలా బాధాకరం అన్నారు. నా అభిమానులు కార్యకర్తలతో చర్చించి ఎన్నికల బరిలో ఉంటానని, శ్యాం నాయక్ ను ఓడించడమే నా లక్ష్యం అని తెలిపారు.

Also Read:KTR:తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు

- Advertisement -