రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లలో కరువు లేదు కర్ఫ్యూ లేదన్నారు మంత్రి కేటీఆర్. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్‌లో మాట్లాడిన కేటీఆర్…ఇవాళ తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో సమతుల్యత సాధించామన్నారు. పల్లెలు, పట్టణాల్లో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. ఐటీ ఎగుమతులు 400 శాతం పెరిగాయన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ అణగదొక్కిందన్నారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్లు గోసపడిందన్నారు. 11 సార్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఏం చేసిందో ఆలోచించాలన్నారు. కనీసం కరెంట్, నీళ్లు కూడా ఇవ్వలేకపోయిందన్నారు. నాడు మైగ్రేషన్‌కు కేరాఫ్ పాలమూరు…ఇవాళ ఇరిగేషన్కి కేరాఫ్‌గా మారిందన్నారు. అందుకే దేశంలోని ఏ రాష్ట్రం సాధించని ప్రగతి సాధించామన్నారు.
ఏ రంగాన్ని తీసుకున్న తెలంగాణ కంటే మెరుగైన ప్రగతి సాధించిన రాష్ట్రం ఉందా ఆలోచించాలన్నారు. అభివృద్ధిలో అగ్రగామి తెలంగాణ అన్నారు. వృద్ధిరేటలో ఐదో స్థానంలో ఉన్నామన్నారు.సాగునీటి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు, మిషన్ భగీరథతో తాగు నీటి సమస్యను అధిగమించామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 అన్నారు. కేంద్రంలో బీజేపీ తెలంగాణకు ఇచ్చింది శూన్యం అన్నారు. ఓట్లు అడిగే ముందు తెలంగాణకు ఏం చేశామో చెప్పి రావాలని బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. ఐటీలో హైదరాబాద్ బెంగళూరును దాటిపోయిందన్నారు.
Also Read:పిక్ టాక్ : బిగువైన డ్రెస్ లో గ్లామర్ డోస్