Bigg Boss 7 Telugu:అంతా అమర్ చుట్టే

55
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 52 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా అమర్ చుట్టే ఎపిసోడ్ అంతా నడిచింది. ఈ వారం మొత్తం హౌస్‌లో బీబీ మారథాన్ జరుగుతుందని చెప్పిన బిగ్ బాస్..మీరు ఆడే ప్రతి ఆట, కృషి ఆధారంగానే మీరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారా లేదా అనేది నిర్ణయిస్తాం అని చెప్పారు. గేమ్‌లో లాస్ట్ వచ్చినవాళ్లు కెప్టెన్సీ కంటెండర్ రేసు నుంచి తప్పుకుంటారని…కెప్టెన్ కావాలనుకునే వారు ప్రతి గేమ్ గెలవాలని చెప్పారు.

తొలి గేమ్‌లో ప్రకటించగానే అమర్ నేను ఆడగాను అని ముందుకురాగా నిజానికి ఎవరు ఆడాలో ముందు నలుగురు పేర్లు అర్జున్ ప్రపోజ్ చేశాడు. అందులో భోలే కూడా ఉండటంతో కావాలని అమర్ గొడవ పెట్టుకున్నాడు. మీకెందుకు మీరెలాగో కంటెండర్ షిప్ అందరికీ ఇచ్చేస్తారు కదా.. నేను వెళ్తా అన్నాడు. దీనికి భోలే శాంతంగా ఎందుకయ్యా నాతో గొడవ.. పాత విషయాలు తవ్వుతావ్ అంటూ భోలే చెప్పాడు. చివరి భోలే తప్పుకోవడంతో అమర్‌ లైన్‌లోకి వచ్చేశాడు.

గేమ్ రూల్ ఏంటంటే నలుగురికి రకరకాల వస్తువులను చూపిస్తారు.. అవి నీటిలో తేలుతాయో లేక ములుగుతాయో సరిగ్గా గెస్ చేయడమే గేమ్ అన్నమాట. ఈ ఆటకి గౌతమ్ సంచాలక్‌గా ఉన్నాడు. ప్రియాంక కరెక్ట్ చెప్పి ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా రెండో స్థానంలో శోభా ఉంది.

గేమ్ అయిపోయిన తర్వాత అమర్‌ దగ్గరికి వచ్చి శోభా చర్చ పెట్టింది. తాను చెప్పిన ఆన్సర్ ఎందుకు పెట్టలేదు.. నా మీద నమ్మకం లేదా అంటూ అడిగింది. తర్వాత కెప్టెన్సీ రేసు నుంచి పోవడంతో అమర్ తిండి మానేసి అలా ఒంటరిగా కూర్చొని ఏడుపు మొదలుపెట్టాడు. ఉదయం కాగానే శివాజీ అండ్ కో అమర్‌పై కాసేపు జోకులేసుకున్నారు.

Also Read:సందీప్ కిషన్…ఊరు పేరు భైరవకోన

- Advertisement -