ఆకట్టుకుంటున్న “నరకాసుర” ట్రైలర్

26
- Advertisement -

“పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన సినిమా “నరకాసుర”. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో “నరకాసుర” మూవీ రిలీజ్ కాబోతోంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ హీరో నాగశౌర్య చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

నటుడు సలీమ్ ఫేకు మాట్లాడుతూ – “నరకాసుర” సినిమాలో రక్షిత్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అతను ఈ సినిమాకు చూపించిన డెడికేషన్ కు హ్యాట్సాఫ్. అలాగే డైరెక్టర్ సెబాస్టియన్ కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించాడు. జబల్ పూర్, వైజాగ్ వంటి అనేక లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. సీన్స్, సాంగ్స్ చాలా బాగుంటాయి. గతంలో సూర్య వర్సెస్ సూర్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జాతిరత్నాలు సినిమాల్లో చిన్న క్యారెక్టర్ చేస్తే ఈ సినిమాలో నేను ఇంపార్టెంట్ రోల్ చేశాను. “నరకాసుర” అద్భుతమైన సినిమా. మీరంతా తప్పకుండా చూడాలి. అన్నారు.

నటుడు సుజిత్ మాట్లాడుతూ – “నరకాసుర” మూవీలో నాకు ఒక మంచి రోల్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సెబాస్టియన్ కు థ్యాంక్స్. నా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. ఆ సస్పెన్స్ ఇప్పుడు చెప్పలేను. ఇండియాలోని ఇంపార్టెంట్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. అన్ని రకాల ఎమోషన్స్ తో సినిమా ఆకట్టుకుంటుంది. మా టీమ్ అందరికీ స్పెషల్ మూవీ అవుతుంది. అన్నారు.

నిర్మాత డాక్టర్ అజ్జా శ్రీనివాస్ మాట్లాడుతూ – “నరకాసుర” సినిమా టీమ్ నుంచి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు చెబుతున్నాం. మా కార్యక్రమానికి అతిథిగా వచ్చిన హీరో నాగశౌర్య గారికి థ్యాంక్స్. హీరో రక్షిత్ మూడేళ్లు హార్డ్ వర్క్ తో “నరకాసుర” సినిమాలో అద్భుతంగా నటించారు. నాజర్, చరణ్ రాజ్, శ్రీమాన్ వంటి సీనియర్ యాక్టర్స్ మంచి క్యారెక్టర్స్ చేశారు. డైరెక్టర్ సెబాస్టియన్ డెడికేషన్ తో సినిమా చేశారు. నవంబర్ 3న థియేటర్స్ లో “నరకాసుర” సినిమా చూడమని కోరుతున్నా. అన్నారు.

Also Read:సీతాఫలం తింటే ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -