ఎన్టీఆర్ కోసం బోల్డ్‌గా నగ్మా

44
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో క్రేజీ మూవీగా తెరకెక్కుతోన్న దేవర షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో నడుస్తుంది. ఎన్టీఆర్ ఆగస్టు వరకు అటు ఇటుగా డేట్స్ కేటాయించినా.. ఆగస్ట్ చివరి నుంచి దేవర సెట్స్‌లోనే కనిపిస్తున్నారు. ఎలాగైనా ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ బరిలో దించాలని కసిగా కష్టపడుతున్నారు. ఇక దసరాకి దేవర నుంచి ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ వస్తుంది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశపడితే.. అది జరగలేదు. కానీ ఈ సినిమా నుంచి ఓ అప్ డేట్ మాత్రం వినిపిస్తోంది.

ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ నగ్మా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. దేవర కోసం ఆమె డిసెంబర్ మొదటివారం వరకు డేట్స్ కేటాయించారని సోషల్ ఇండియా టాక్. ఇందులో ఆమె పాత్ర చాలా బోల్డ్ గా ఉండబోతుందని, కొరటాల శివ తనదైన స్టైల్‌లో ఆమె పాత్రని డిజైన్ చేశారనేలా టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ మెయిన్ విలన్‌గా స్టైలిష్ గా కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన స్పెషల్‌గా మేకోవర్ అయ్యారట.

అలాగే మరో ప్రముఖ పాత్రలు జగపతి బాబు నటిస్తున్నాడు. జగపతి బాబు ఎన్టీఆర్ కి ఫాదర్ గా కనిపిస్తున్నాడు. మరి దేవర షూటింగ్ వచ్చే ఏడాది మార్చికి ఫినిష్ చేసి చాలా వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి సమ్మర్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలని కొరటాల శివ తెగ కష్టపడుతున్నాడు. అదే జరగాలని, పోస్ట్ పోన్ అనే మాట వినకూడదని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read:కే‌సి‌ఆర్ తో ఢీ.. ఈటెల నిలిచేనా?

- Advertisement -