సీతాఫలం తింటే ఎన్ని ప్రయోజనాలో..!

26
- Advertisement -

సీజనల్ గా వచ్చే పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. వర్షాకాలం ముగింపు.. చలికాలం ప్రారంభ దశలో లభ్యమయ్యే సీతాఫలాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, సి, ఇ, బి6, బి12 వంటి వాటితో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి కూడా అధిక మోతాదులో లభిస్తాయి. ఇంకా ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా అల్సర్ తో బాధపడే వారు తప్పకుండా ఈ పండ్లను తినాలని నిపుణులు చెబుతున్నారు..

ఇంకా కంటిచూపును మెరుగుపరచడంలోనూ, మెదడు పనితీరును పెంచడంలోనూ సీతాఫలాలు ఎంతగానో ఉపయోగపడతాయట. ఇందులో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అందువల్ల రక్తహీనతను దూరం చేసి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఇంకా రక్తంలోని కొలెస్ట్రాల్ ను దూరం చేయడంలో కూడా ఈ పండు ఉపయోగపడుతుంది. సీతాఫలంలో లో ఉండే యాంటీ బయో యాక్టివ్ అణువులు.. శరీరంలోని క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి.

సీతాఫలంలో మెగ్నీషియం మెండుగా ఉంటుంది. ఇది శరీరంలోని నీటి శాతాన్ని క్రమబద్దీకరిస్తుంది. నీరసం, అలసట వంటి సమస్యలు ఏర్పడినప్పుడు సీతాఫలం తింటే తక్షణ శక్తి లభిస్తుందట. ఇక ఇందులో ఉండే పొటాషియం కండరాల బలహీనతను దూరం చేసి శక్తినిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ పండ్లను తప్పనిసరిగా తినాలట. ఎందుకంటే వారి శరీరంలో వచ్చే మార్పులను తట్టుకునే శక్తిని సీతాఫలాలు ఇస్తాయి. అందుకే సీజనల్ గా లభించే ఈ పండ్లను తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:#Nani31..అప్‌డేట్

- Advertisement -