ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ టీజర్..

290
Sumanth Ashwin, Anisha Ambrose, Manali Rathode, Manasa Himavarsha
- Advertisement -

80లలో క్రియేటివ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో వచ్చిన ”లేడీస్ టైలర్” ఒక ప్రభంజనం. ముఖ్యంగా జమ జచ్చ అదేనండీ ‘మచ్చ’ కాన్సెప్టు అదిరిపోయింది. ఏ హీరోయిన్ కు మచ్చ ఉంటుందో ఆమెనే పెళ్ళి చేసుకుంటే తన పంట పండుతుందని చూస్తుంటాడు హీరో. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది. మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ చిత్రం టీజర్ బుదవారం విడుదల అయ్యింది. ముప్పై ఏళ్ళ క్రితం విడుదలై సంచలన విజయం సొంతం చేసుకున్న ‘లేడీస్ టైలర్’ చిత్రానికి ఇది సీక్వెల్. జూన్ రెండవ తేదిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.

సుమంత్ అశ్విన్, అనీషా ఆమ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్ష హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదల అయిన ఈ చిత్రం పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యి, ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించాయి.

ఈ సందర్భంగా చిత్ర హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, “వంశీ గారితో పని చేయటం నిజంగా ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి గారికి చాలా థాంక్స్. టీం అందరు కూడా చాలా కష్టపడ్డారు. జూన్ రెండు ఎప్పుడు వస్తుందాని వెయిట్ చేస్తున్నాను.” అన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, “వంశీ గారి డైరెక్షన్ లో లేడీస్ టైలర్ సినిమాకి సీక్వెల్ చేయాలన్నది నా కల. అలాంటి నా కలను ఆయన చాలా అందంగా, మ్యూజికల్ గా ఆవిష్కరించారు. త్వరలో ట్రైలర్ కూడా విడుదల చేసి, జూన్ రెండవ తారీఖున సినిమాని మీ ముందుకి తీసుకువస్తాను. లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు లాంటి వంశీ గారి చిత్రాలను మీరు ఎలా అయితే ఎంజాయ్ చేసారో వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుంది. సుమంత్ చాలా కష్టపడ్డాడు. ఒక ఫిల్మ్ మేకర్ గా నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది” అన్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వంశీ మాట్లాడుతూ, “ఈ సినిమా చేయటానికి ముఖ్య కారణం నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి గారు. ఈ సినిమా చేసేటప్పుడు లేడీస్ టైలర్ సినిమా చేస్తున్నపుడు కలిగిన అనుభూతే కలగటం విశేషం. ఆనాడు నేను పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇందులో లేకపోయినా… నేటి తరంతో వర్క్ చేయటం చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే మణిశర్మ చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చారు. జూన్ రెండున విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని మీరు తప్పక ఆదరిస్తారని ఎదురుచూస్తున్నాను. థాంక్యూ.” అన్నారు.

- Advertisement -