లెక్కకు మించిన అకౌంట్ల సమాచారాన్ని అందించండి:రోనాల్డ్ రాస్

49
- Advertisement -

ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో అనుమానిత నగదు లావాదేవీలు, లెక్కకు మించిన నగదు అకౌంట్ ల సమాచారాన్ని ఎన్నికల నోడల్ ఆఫీసర్ అకౌంటింగ్ కు రోజువారీగా రిపోర్ట్ ద్వారా అందించాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. గురువారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం పన్వర్ హాల్ లో హైదరాబాద్ జిల్లాలోని అన్ని బ్యాంకు మేనేజర్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ… ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బ్యాంకులలో జరిగే డిజిటల్ లావాదేవీలలో అనుమానిత, లెక్కకు మించిన నగదు అకౌంట్ లపై నిఘా ఉంచి వాటి సమాచారాన్ని ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు జిల్లా ఎన్నికల అధికారికి పంపించాలని తెలిపారు. యు.పి.ఐ (గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే) ల ద్వారా ఎక్కువ అకౌంట్ లకు నగదు ట్రాన్సఫర్ అయ్యే అకౌంట్ లకు సంబంధించిన సమాచారాన్ని అందిచాలని తెలిపారు. ఏ.టి.ఎం లలో నగదు డిపాజిట్ చేయడానికి వినియోగించే వాహనాలకు ఆయా బ్యాంకులు తప్పనిసరిగా జి.పి.ఎస్ ను ఏర్పాటు చేసి వాహనాలను పరిశీలించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ని అనుసరించి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం జరుగుతుందని, బ్యాంకు అధికారులు తరలిస్తున్న నగదు కు తప్పనిసరిగా డాక్యుమెంట్ లు, క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ నగదుకు సంబంధించి రిసిప్ట్ లను తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు.

Also Read:కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తారా?

డిప్యూటీ డీ.ఈ.ఓ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ… నగరంలో పట్టుబడుతున్న నగదును పరిశీలించి ఎటువంటి సమస్య లేనప్పుడు వాటిని వేగవంతంగా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. అభ్యర్థుల తుది జాబితా నవంబర్ 13వ తేదీ నుండి 30వ తేదీ వరకు పోటీలో పాల్గొనే రాజకీయ పార్టీల అభ్యర్థుల అకౌంట్ నెంబర్లను సంబంధిత బ్యాంకులకు అందించడం ద్వారా వారి లావాదేవీలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. అభ్యర్థి, అభ్యర్థి సంబంధికుల అకౌంట్ల నగదు లావాదేవీలను అందించాలని తెలిపారు. పొలిటికల్ పార్టీలు ఒక లక్ష కు మించిన నగదు లావాదేవీల పై సమాచారం అందించాలని తెలిపారు. అన్ని బ్యాంకులు అనుమానిత, ఎక్కువ మొత్తంలో నగదు డిపాజిట్ అయిన అకౌంట్ లు, రాజకీయ పార్టీల అకౌంట్ లపై సమచారాన్ని ఇవ్వాలన్నారు.ఈ సమావేశంలో నోడల్ ఆఫీసర్ శరత్ చంద్ర, అడిషనల్ కమిషనర్ ఎలక్షన్ శంకరయ్య, ఐ.టీ అధికారులు మనీష, ఆర్.బి.ఐ మేనేజర్, హైదరాబాద్ జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనజర్లు పాల్గొన్నారు.

- Advertisement -