కాంగ్రెస్ బీజేపీ ‘తోడు దొంగలు’!

49
- Advertisement -

తోడు దొంగలు అనే పదం సినిమాల్లో ఎక్కువగా వింటూ ఉంటాము. ఒక దొంగల ముఠా మరో దొంగల ముఠాకు సాయం చేయడం. కానీ పైకేమో కారాలు మిరియాలు నూరుకుంటూ కత్తులు దూయడం. కానీ ఏదైనా దోచుకోవాల్సి వచ్చినప్పుడు కలిసి ధోచుకొని ఉమ్మడిగా పంచుకోవడం. ఇది తోడు దొంగలు చేసే పని. సరిగ్గా రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. స్వతంత్రం లభించిన ఈ 75 ఏళ్లలో కాంగ్రెస్ 65 సంవత్సరాలు దేశాన్ని దోచుకుంటే బీజేపీ 10 సంవత్సరాలు దేశాన్ని ధోచుకుంది. ఇక అంతర్గతంలో ఈ రెండు పార్టీలు కలిసి దోచుకున్నది అసలు లెక్కేలేదు. .

పైకేమో ప్రధాన ప్రత్యర్థి పార్టీలుగా కలరింగ్ ఇచ్చుకుంటూనే లోలోపల లోపాయికారి ఒప్పందాలకు శ్రీకారం చూడుతూ ఉంటాయి. దేశంలో గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్.. ప్రత్యర్థి పార్టీ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, జేడీయూ.. ఇలా చాలా పార్టీలలోని నేతలు ఇప్పటికే జైలు పాలు కూడా అయ్యారు. కానీ కాంగ్రెస్ కు చెందిన చాలమంది అవినీతికి పాల్పడినట్లు ఆధారాలున్నప్పటికి వారికి మాత్రం ఎలాంటి శిక్ష లేదు.

ఉదాహరణకు నేషనల్ హెరాల్డ్ కేసునే పరిశీలిస్తే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రధాన నిందితులుగా పరిగణించాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ ఇంతవరకు వారిపై శిక్షకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక తెలంగాణ విషయానికొస్తే బి‌ఆర్‌ఎస్ నేతలపై ఐటీ దాడులతో రెచ్చిపోయే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై మాత్రం ఇంతవరకు ఒక్క ఐటీ రైడ్ జరపలేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ మరియు బీజేపీ తోడు దొంగలని, ఈ రెండు పార్టీల మద్య ఉన్న అంతర్గత ఒప్పందం ప్రజాలకు తెలియందేమీ కాదు. ఈ రెండు పార్టీలు ఎన్ని జిమ్మీక్కులు వేసిన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదనేది అందరికీ తెలిసిన విషయం.

Also Read:18 ఏళ్ల కుర్రాడితో త్రిష బరితెగింపు

- Advertisement -