ఇజ్రాయెల్ నుండి సురక్షితంగా స్వదేశానికి..

28
- Advertisement -

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. హమాస్ ఉగ్రదాడిని నిరసిస్తూ ఆ దేశంపై బాంబులతో విరుచుకపడుతుండగా అగ్రరాజ్యం అమెరికా సైతం ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తోంది. ఇక ఇజ్రాయెల్ – హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌ నుండి భారతీయులను సురక్షితంగా వెనక్కి రప్పిస్తోంది భారత్.

ఆపరేషన్ అజయ్ పేరుతో భారత ప్రభుత్వం తరలింపు చర్యలు చేపట్టింది. తొలి విమానంలో 212 భారతీయులు స్వదేశం చేరుకోగా ఇజ్రాయెల్‌లో సుమారు 18వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అజయ్ విజయవంతం కావడంపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ కన్నిటీ పర్యంతం అయ్యారు. ఇజ్రాయెల్‌ నుంచి తొలి విమానంలో వచ్చిన భారతీయులు టెల్ అవీవ్, హైఫా నగరాల్లో నివసిస్తున్నారు. హమాస్ విరుచుకుపడ్డ తరుణంలో అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఎలా ఉండాలనే దానిపై ముందే శిక్షణ ఇచ్చరాని చెప్పుకొచ్చారు.

Also Read:పాక్ పై గెలవాలంటే..అలా చేయాల్సిందే!

- Advertisement -