బాలయ్య బాబు – రవితేజ మధ్య పోటీ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో వారి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. ఈ దసరా ఫెస్టివల్ కి పోటీ పడబోతున్న సినిమాల్లో వీరి సినిమాలే ప్రముఖమైనవి. సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. అనిల్ కి హాస్య దర్శకుడు అని మంచి పేరుంది. పైగా బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఎలా చూసుకున్నా.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. కానీ విచిత్రంగా ఇప్పుడు అందరి చూపు రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరావు మీదే ఉంది.
ఈ నెల 20న టైగర్ నాగేశ్వరావు రిలీజ్ అవుతుండగా.. 19 న బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి విడుదలకాబోతుంది. ఈ రెండు సినిమాల ట్రైలర్స్ విషయంలో రవితేజ సినిమాకే ఎక్కువ మార్క్ లు పడ్డాయి. బాలయ్య సినిమా విషయంలో ఆయన అభిమానులు కాస్త అసంతృప్తిలో ఉన్నారు. భగవంత్ కేసరి ట్రైలర్ పై డిస్పాయింటెడ్ హాష్ టాగ్ కూడా ట్రెండ్ అయ్యింది. ముఖ్యంగా అనిల్ రావిపూడి భగవంత్ కేసరి మూవీని బాగా హ్యాండిల్ చేయలేదు అంటూ.. మెయిన్ గా ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రివీల్ అవ్వలేదు అంటూ బాలయ్య అభిమానులు కాస్త ఆందోళన పడ్డారు.
దీనికితోడు, రవితేజ తన సినిమా ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం తిరుగుతున్నాడు. బాలయ్య మాత్రం కనీసం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తన సినిమాని బలంగా ప్రమోట్ చేయలేకపోతున్నాడు. టైగర్ నాగేశ్వరావు ట్రైలర్ తో అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుని ప్రమోషన్స్ తో రవితేజ పరుగులు పెట్టిస్తున్నాడు. అటు ఎయిర్ పోర్ట్ లోను, ఈవెంట్స్ లోను, ఇంటర్వూస్ లోను, పబ్లిక్ లోను ఇలా ఎక్కడ చూసినా రవితేజ పిక్స్ నే ఎక్కువ హైలైట్ అవుతున్నాయి. బాలయ్య సినిమా మాత్రం అడ్రెస్ లేకుండా పోయింది. మొత్తమ్మీద ఈ దసరాకి విజేత రవితేజనే అన్నట్టుగా ఉంది ప్రస్తుత వ్యవహారం.
Also Read:రాగిపాత్రలతో ఆరోగ్యం..