నాని..హాయ్ నాన్న రిలీజ్ డేట్ ఫిక్స్!

40
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, బ్యూటీఫుల్ మృణాల్ ఠాకూర్ తొలిసారి జంటగా నటిస్తున్న పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘హాయ్ నాన్నా’. హాయ్ నాన్నా సాధారణ ప్రేమకథ కాదు, ఈ చిత్రం తండ్రీకూతుళ్ల అందమైన, భావోద్వేగ ప్రయాణాన్ని ప్రజెంట్ చేస్తుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బేబీ కియారా ఖన్నా నాని కూతురిగా నటించింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా మూవీపై మంచి హైప్ క్రియేట్ కావడంతో హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రీ పోన్ అవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ 7 లేదా 8 తేదీల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వహాద్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

Also Read:Israel war:3 వేల మంది మృతి

- Advertisement -