ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రజలు ఉద్యమబాట పట్టారు. క్షేత్రస్ధాయిలో ప్రజలు…జెండా,ఏజెండాలను పక్కనబెట్టి…స్పెషల్ స్టేటస్ కోసం పోరుబాట పడుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కావాల్సిందేనని నిలదీస్తున్నారు. వీరికి అన్నిరాజకీయ పార్టీల నుంచి పూర్తిస్ధాయిలో మద్దతు లభిస్తోంది. ప్రత్యేకహోదాపై స్పందించాల్సిన టీడీపీ,బీజేపీ నేతలు నోరుమెదపక పోవడంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. జనతా క్యాబేజ్,నారా వారితో కమలం ప్రయాణం అంటూ కామెడీ ఫోటోలను పోస్టు చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు.
తాజాగా చంద్రబాబు ప్రత్యేకహోదాపై మాట్లాడిన వీడియోని పోస్ట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు అపరిచితుడు అంటూ ట్విట్ చేస్తున్నారు.హీరోలు మారువేషాల్లో వచ్చి విలన్లను చితక్కొడుతుంటారు. మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తిత్వాలను అపరిచితుడు వంటి సినిమాల్లో చూశాం. కానీ నిజజీవితంలో రియల్ అపరిచితుడు చంద్రబాబు అంటు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఈ వీడియోలో ఏపికి ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య అని వ్యాఖ్యానించిన చంద్రబాబు తర్వాత ప్రత్యేక ప్యాకేజీని మరింతగా సమర్ధిస్తూ మాట్లాడడం విశేషం. ప్రత్యేక హోదా వస్తే చాలా రాయితీలు వస్తాయంటున్నారు, ఎలా వస్తాయి? ఇప్పటివరకు ఎక్కడైనా వచ్చాయా? అని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలకు ఏమొచ్చింది? అని చంద్రబాబు అడిగారు. . హోదాతో సమానంగా బెనిఫిట్స్ ఇస్తామంటే తీసుకోవద్దా అని బాబు మాట మార్చడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
https://youtu.be/aD7wCYbM7Y8