ఎలక్షన్ రిపోర్ట్:బెల్లంపల్లిలో బి‌ఆర్‌ఎస్ కు తిరుగులేదా!

39
- Advertisement -

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఈసారి గెలుపేవరిది అనే దానిపై ఆసక్తి నెలకొంది. 2009లో నియోజిక వర్గాల పునర్వ్యవస్థీకరణ అమలులో కారణంగా మంచిర్యాల నియోజికవర్గంగా ఏర్పడింది. అంతకు ముందు ఆసిఫాబాద్ నియోజిక వర్గంలో భాగమై ఉండేది. కాగా బెల్లంపల్లి నియోజిక వర్గంగా ఏర్పడిన తరువాత మూడు సార్లు ఎన్నికలు జరగగా 2009 లో సిపిఐ అభ్యర్థి గుండా మల్లేశ్ విజయం సాధించారు. ఆ తరువాత 2014 లోనూ 2018 లోనూ టి‌ఆర్‌ఎస్ ( బి‌ఆర్‌ఎస్ ) అభ్యర్థి దుర్గం చిన్నయ్య విజయం సాధిస్తూ వచ్చారు. ఈసారి కూడా బి‌ఆర్‌ఎస్ నుంచి దుర్గం చిన్నయ్యకే టికెట్ కేటాయించారు .

బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్. దాంతో ఈసారి కూడా బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య గెలుపు ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం నియోజిక వర్గంలో దుర్గం చిన్నయ్యపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉంది. బొగ్గు గనులకు కేంద్రంగా ఉన్న బెల్లంపల్లిలో మొదట కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం ఉండేది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కే‌సి‌ఆర్ నాయకత్వానికి ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతూ వచ్చారు. ఫలితంగా బి‌ఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య అత్యధిక మెజారిటీతో గెలుపొందుతూ వచ్చారు. గత ఎన్నికల్లో ప్రధానంగా బిఎస్పీ అభ్యర్థి గడ్డం వినోద్ పై 11 వేల మజారిటీతో విజయాన్ని సొంత చేసుకున్నారు. ఇక కాంగ్రెస్, బిజెపి విషయానికొస్తే ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటివరకు అభ్యర్థులు ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. అభ్యర్థులు ఎవరైనా కాంగ్రెస్, బిజెపికి బెల్లంపల్లిలో పెద్దగా ప్రజాధరనల్ లేదనే సర్వేలు చెబుతున్నాయి. దాంతో ఈసారి కూడా బి‌ఆర్‌ఎస్ కు బెల్లంపల్లిలో తిరుగులేదనే చెప్పాలి.

Also Read:క్లాస్, మాస్‌ని మెప్పించిన మారుతి..

- Advertisement -