క్లాస్, మాస్‌ని మెప్పించిన మారుతి..

28
- Advertisement -

క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడు మారుతి. ఆయన సినిమాలు థియేటర్ లో బెంచ్ టికెట్ నుంచి బాల్కనీ దాకా ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా ఉంటాయి. కమర్షియల్ సినిమాలు చేస్తూ ఆ కథల్లో ఏదో ఒక మంచి విషయాన్ని ప్రేక్షకులకు చెప్పడం దర్శకుడిగా మారుతి ప్రత్యేకత.

ఈ రోజుల్లో, బస్ స్టాప్ సినిమాలతో యూత్ ట్రెండ్ మళ్లీ తీసుకొచ్చాడు డైరెక్టర్ మారుతి.
డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకుని 5డీ లో పిక్చరైజ్ చేసి సక్సెస్ ఫుల్ సినిమా ఇవ్వొచ్చని ప్రూవ్ చేశాడు. ప్రేమ కథా చిత్రమ్ తో హారర్ కామెడీతో మారుతి ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. భలే భలే మగాడివోయ్ సినిమాతో ఇండస్ట్రీకి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అందించి డైరెక్టర్ గా మరో మెట్టు ఎదిగాడు మారుతి. ఆయన సినిమాలు యావరేజ్ గా ఆదరణ పొందినా డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ కు లాభాలు తెచ్చిపెడుతుంటాయి.

హీరోలందరి ఫేవరేట్ డైరెక్టర్ అయ్యారు మారుతి. తన ఫెయిల్యూర్ మూవీస్ నుంచే నిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటానని, అందుకే కంటిన్యూ ఫ్లాప్స్ తనకెప్పుడూ రాలేదని చెబుతుంటారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. తనే ఒక ప్రొడ్యూసర్ కావడంతో ప్రొడ్యూసర్ యాంగిల్ లో అనుకున్న బడ్జెట్ లో సినిమాలు చేయడం దర్శకుడిగా మారుతి ప్రొఫెషనలిజం చూపిస్తుంటుంది.

ప్రస్తుతం స్టార్ హీరో ప్రభాస్ తో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్నారు దర్శకుడు మారుతి. ఇది ఆయన కెరీర్ లో ఒక స్పెషల్ మూవీ కాబోతోంది. హీరో ప్రభాస్ ఇమేజ్ కు తగినట్లు ఉంటూనే తన స్ట్రెంత్ అయిన ఎంటర్ టైన్ మెంట్ తో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు మారుతి. మంచి పాజిటివ్ అట్మాస్పియర్ లో ప్రభాస్ తో తన సినిమా ప్రోగ్రెస్ అవుతోందని డైరెక్టర్ మారుతి తెలిపారు.

రీసెంట్ గా తన మిత్రుడు, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ తో కలిసి మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో మారుతి నిర్మించిన “బేబి” సినిమా ఘనవిజయం సాధించింది.

Also Read:టీడీపీ అధికారంలోకి వస్తే.. పరిస్థితేంటి?

- Advertisement -