15 నుండి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు

32
- Advertisement -

గతమాసం సెప్టెంబర్‌ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామ‌ని, అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. గతమాసం సెప్టెంబర్‌ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారని చెప్పారు.

గరుడ సేవనాడు గ్యాలరీల బయట వేచి ఉన్న భక్తులను ఏడు ప్రత్యేక ప్రవేశమార్గాల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతించి ఎక్కువమందికి సంతృప్తికర దర్శనం కల్పించాం అన్నారు. గరుడ సేవనాడు భక్తులందరికీ అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా అందించడం జరిగిందని చెప్పారు. అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. ఇందుకోసం ఈ నెల 14న అంకురార్పణ జరుగనుందన్నారు..

ఈ ఉత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 19న గరుడసేవ, అక్టోబరు 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, అక్టోబరు 23న చక్రస్నానం నిర్వహిస్తాం అన్నారు. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. భ‌క్తులంద‌రికీ ద‌ర్శ‌నం క‌ల్పించేలా రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు ఉంటుందన్నారు. ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవని చెప్పారు.

Also Read:లండన్‌ అంబేద్కర్ మ్యూజియంలో ఎమ్మెల్సీ కవిత..

- Advertisement -