ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ కోసం భారత్ సమాయత్తం అవుతోంది. రేపు తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియా జట్టుతో ప్రారంభించనుంది టీమిండియా. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో 2-1 తో విజయం సాధించి ఆసీస్ పై పైచేయి సాధించింది. అదే ఆత్మవిశ్వాసంతో రేపటి మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియాపై విజయం సాధించి శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు వన్డే సిరీస్ లో చివరి మ్యాచ్ గెలిచిన ఆసీస్ వరల్డ్ కప్ లో జరిగే తొలి మ్యాచ్ లో టీమిండియాను ఓడించేందుకు అస్త్రశాస్త్రాలు సిద్దం చేసుకుంటోంది. కాగా వన్డే సిరీస్ లో టీమిండియా స్పిన్ మాయాజాలనికి ఆసీస్ బ్యాట్స్ మెన్స్ తడబడ్డారు. .
దాంతో తొలి మ్యాచ్ లో ఆసీస్ ను మట్టికరిపించేందుకు స్పిన్నర్లనే ప్రధానంగా బరిలోకి దించే అవకాశం ఉంది టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆఫ్ స్పిన్నర్ కుల్దిప్, అల్ రౌండర్ జడేజా వంటి వారిని టీమిండియా బరిలోకి దించే అవకాశముంది. టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవడానికి తగిన ప్రణాళికలను సిద్దం చేసుకున్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ కమీన్స్ మీడియా మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. స్పిన్ ను ఎదుర్కోవడానికి మా బ్యాట్స్ మెన్స్ అన్నీ విధాలుగా సిద్దమౌతున్నారని, భారత పిచ్చులపై ఆస్ట్రేలియాకు మంచి రికార్డులే ఉన్నాయని కమీన్స్ అన్నాడు.
దీంతో ఇరు జట్ల మద్య జరిగే ఆసక్తికరమైన మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్ పై పాకిస్తాన్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 286 పరుగులు చేసింది. రిజ్వాన్ ( 68 ), షకీల్ ( 68 ), నవాజ్ ( 39 ) షాదబ్ ఖాన్ ( 32 ).. పరుగులతో రాణించారు. ఇలా లక్ష్య చేధనలో నెదర్లాండ్ మొదటి నుంచే తడబడుతూ వచ్చింది. బాస్ లీ ( 67 ) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో పాకిస్తాన్ మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
Also ReadLలండన్ అంబేద్కర్ మ్యూజియంలో ఎమ్మెల్సీ కవిత..