సర్వేల రిపోర్ట్..బి‌ఆర్‌ఎస్ దే విజయం!

54
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడడంతో సర్వేల కోలాహలం మొదలైంది. ప్రజానాడీని అంచనా వేస్తూ గెలుపోటములను ముందే ఊహించే సర్వేలు సర్వేల రిపోర్ట్ ఆధారంగానే దాదాపు విజయం ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ఈసారి గెలుపు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రజానీకం మళ్ళీ బి‌ఆర్‌ఎస్ కే పట్టం కట్టబోతున్నట్లు ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సర్వే వెల్లడించింది. ఇక తాజాగా టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో అదే వెల్లడైంది. .

తెలంగాణ ప్రజలు కే‌సి‌ఆర్ పాలన పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నట్లు ఆ సర్వే సంస్థ తేల్చి చెప్పింది. పార్లమెంట్ స్థానాలలో 17 స్థానాలకు గాను 9 నుంచి 11 సీట్లు బి‌ఆర్‌ఎస్ కైవసం చేసుకునే ఆవకాశం ఉందని, బిజెపి 2-3, కాంగ్రెస్ 3-4, ఇతరులు ఒక సీటు కైవసం చేసుకునే ఆవకాశం ఉందని టైమ్స్ నౌ తెలిపింది. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే ఇప్పటివరకు వెలువడిన అన్నీ సర్వేలు కూడా బి‌ఆర్‌ఎస్ కె పట్టం కట్టాయి. గతంలో కంటే ఐ‌ఏ‌ఆర్‌ఐ బి‌ఆర్‌ఎస్ కు ఇంకా సీట్ల సంఖ్య పెరిగే ఆవకాశం ఉందని కూడా తేల్చి చెప్పాయి.

ఇతర రాష్ట్రాలతో పోల్చితే కే‌సి‌ఆర్ పాలన, విజన్ ఆ పార్టీకి ప్రధాన బలం అని అందుకే తెలంగాణ ప్రజానీకం మళ్ళీ కే‌సి‌ఆర్‌ పాలన వైపే మొగ్గు చూపుతున్నాట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ 100 పైగా సీట్లు సాధిస్తుందని కే‌సి‌ఆర్ మొదటి నుంచి చెబుతున్నారు. ప్రస్తుత పరిణామలు చూస్తే ఆ టార్గెట్ ఈజీగా రిచ్ అయ్యే ఆవకాశం ఉందని కూడా సర్వేలు చెబుతున్నాయి. ఇక ఈ ఏడాది డిసెంబర్ లేదా నవంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఆవకాశం ఉందని టాక్. మొత్తానికి మూడోసారి కూడా కే‌సి‌ఆర్‌ సి‌ఎం పదవి అధిష్టించడం ఖాయమే అని తెలుస్తోంది.

Also Read:Venkatesh:’సైంధవ్‌’ కీ అప్‌డేట్

- Advertisement -