Harishrao:ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే

47
- Advertisement -

దేశంలో గజ్వేల్ పేరు, ప్రతిష్టలు నిలబెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు మంత్రి హరీష్ రావు. ములుగు మండలం బండ మైలారం పారిశ్రామిక వాడలో 33/11 కేవీ విద్యుత్‌ సబ్ స్టేషన్‌ను ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్.. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారని ధ్వజమెత్తారు. బండ మైలారం గ్రామ రూపురేఖలు మార్చింది సీఎం కేసీఆర్ అని …గజ్వేల్ ప్రాంతంలో నెలకొన్న 50 ఏండ్ల నీటి కష్టాన్ని కేసీఆర్ తొలగించారని గుర్తు చేశారు. వందల కోట్ల నిధులు కేటాయించి ఎంతో వెనుకబడిన గజ్వేల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని స్పష్టం చేశారు.

కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆదరించాలన్నారు. ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో కేసీఆర్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:చిరుతో బోయపాటి..కన్ఫామ్!

- Advertisement -