మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక డివొర్స్ లో తప్పొప్పుల ప్రస్తావన అటుంచితే.. విడాకుల వ్యవహారం అత్యంత బాధించే అంశం. జీవితంలో పెళ్లి ప్రధాన ఘట్టం. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు తలెత్తితే జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. మానసికంగా వెంటాడే ఎడబాటు ప్రశాంతతను దూరం చేస్తుంది. నిహారిక కొణిదెల కూడా మానసిక సంఘర్షణకు గురైంది. తన విడాకుల వ్యవహారం మీడియా దృష్టికి వచ్చాక మరింత వేదనకు గురయ్యారు. నిరాధారమైన కథనాలు, వార్తలు ఆమెను బాగా ఇబ్బంది పెట్టాయి.
ఒక ప్రక్క ప్రేమించిన వ్యక్తి దూరమైన బాధతో పాటు తప్పుడు కథనాలు మరింత కృంగదీశాయి. ఇలాంటి ఒత్తిడిలో, బాధలో ఉన్నప్పుడు స్నేహితుల తోడు అవసరం. నీహారిక కొణిదెల అదే పని చేస్తోంది. తన బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి వరుసగాటూర్స్ కి వెళ్తుంది. వీలైనంత ఎక్కువ సమయం టూర్స్ లోనే గడపడానికి ప్రయత్నం చేస్తోంది. నీహారిక ఫ్యామిలీ కూడా ఆమెతో కలిసి టూర్ కి వెళ్తున్నారు. మొత్తానికి నిహారిక పరిస్థితిని అర్థం చేసుకొని ఆమె సన్నిహితులు స్నేహితులు తోడుగా నిలబడుతున్నారు.
అలాగే ఇంట్లో ఒంటరిగా ఉంటే నిహారిక ప్రపంచం తన పెట్ డాగ్స్. చాలా కాలంగా నిహారిక ఓ పెట్ డాగ్ ను పెంచుకుంటుంది. దానితో ఆడుకోవడం నిహారిక కు ఇష్టమైన వ్యాపకాలలో ఒకటి. ఈ మధ్య మరో డాగ్ ని కూడా ఆమె ఇంటికి తెచ్చారు. కాగా షూటింగ్ లేకపోతే నిహారిక ఆ రెండు పెట్ డాగ్స్ తో గడుపుతుంది. వ్యాయామం ముగిసిన వెంటనే ఇక వాటితో బిజీ అయిపోతుంది. అలా నిహారిక చైతన్యతో విడాకుల కారణంగా ఏర్పడిన ఒంటరితనాన్ని బాగానే అధిగమిస్తుంది.
Also Read:స్టార్ హీరోయిన్ కొత్త బిజినెస్ లు