KTR:కాంగ్రెస్ 420 పార్టీ

22
- Advertisement -

కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అంటే గ్యారంటీ కాదని అదో 420 పార్టీ అని మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… రైతును రాజుగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని… రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు ఉన్నాయని చెప్పారు.

ఇక కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పుడే అవినీతికి తెరలేపిందని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు కేటీఆర్. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో నిధుల సమీకరణ కోసం బెంగళూరు బిల్డర్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వం పన్ను విధిస్తున్నదని విమర్శించారు. ప్రతి చదరపు అడుగుకు రూ.500 చొప్పున రాజకీయ ఎన్నికల పన్ను విధించడం ప్రారంభించిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు స్కాంగ్రెస్‌ను తిరస్కరిస్తారని ఎద్దేవా చేశారు.

Also Read:Bigg Boss 7 Telugu:ఈ వారం డబుల్ ఎలిమినేషన్!

- Advertisement -