నో బెయిల్.. లోకేష్ జైలుకే?

47
- Advertisement -

ఏపీలో రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ టార్గెట్ గా బయటపడుతున్న స్కామ్ లు రాష్ట్ర రాజకీయల్లో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. ఆ మద్య బయటపడిన స్కిల్ స్కామ్ లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఇక ఇప్పుడు నారా లోకేష్ టార్గెట్ గా అడుగులు పడుతున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో జరిగిన స్కామ్ లో నారా లోకేష్ ను ఏ14గా పరిగణిస్తూ ఏపీ సీఐడీ వ్యాఖ్యానించింది. దీంతో నారా లోకేష్ అరెస్ట్ కదా కన్ఫర్మ్ అనే వాదన మొదలైంది. ఈ నేపథ్యంలో లోకేష్ కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు అను ఆశ్రయించడంతో రింగ్ రోడ్ స్కామ్ నిజమేనా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. .

కాగా ముందస్తు బెయిల్ పై నేడు విచారణ జరిపిన హైకోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించి సీఐడీ విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో నారా లోకేష్ కు బిగ్ షాక్ తగిలినట్లైంది. ప్రస్తుతం డిల్లీలో ఉన్న ఆయన.. ఏపీకి ఎప్పుడు వస్తారనే క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఏకంగా డిల్లీ వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. జరుగుతున్నా పరిణామాలన్నీ గమనిస్తే లోకేష్ అరెస్ట్ కూడా ఖాయమా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఒకవేళ లోకేష్ అరెస్ట్ అయితే టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అధినేత చంద్రబాబు నాయుడు గత 15 రోజులుగా రిమాండ్ లోనే ఉన్నారు. ఇక లోకేష్ కూడా అరెస్ట్ అయితే ఇద్దరికి బెయిల్ ఎప్పుడొస్తుందో అని టీడీపీ శ్రేణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. మొత్తానికి టీడీపీని చుట్టుముట్టిన స్కామ్ లు ఆ పార్టీ అధినేతలను కుదేలు చేస్తున్నాయి. మరి వీటినుంచి ఎలా బయటపడతారో చూడాలి.

Also Read:దాల్చిన చెక్క నీరు తాగితే.. లాభాలెన్నో!

- Advertisement -