టీమిండియాలో వీరే కీలకం!

30
- Advertisement -

ప్రస్తుతం టీమిండియా అత్యుత్తమ గణాంకాలతో దూసుకుపోతుంది. ఆ మద్య జరిగిన ఆసియా కప్ తో పాటు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకొని వరల్డ్ కప్ కు ముందు పూర్తి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఈసారి స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండడంతో కప్పు ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ప్రస్తుతం జట్టు కూడా అత్యంత పటిష్టంగా ఉండడం సానుకూలాంశం. గత కొన్నాళ్లుగా బ్యాటింగ్, బౌలింగ్, అన్నీ విభాల్లోనూ తిరుగులేని ఆదిపత్యం ప్రదర్శిస్తోంది. యువ ఆటగాళ్లు సీనియర్ ప్లేయర్లు, అందరూ కూడా సమిష్టిగా రాణిస్తున్నారు. దీంతో వరల్డ్ కప్ బరిలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా మారింది. .

ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్ మన్ గిల్, హర్ధిక్ పాండ్య.. వంటి ఆటగాళ్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ లో బుమ్రా, మహ్మద్ శమి, సిరాజ్ వంటి వారు సైతం ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇప్పటివరకు 250 మ్యాచ్ లు ఆడిన రోహిత్ శర్మ 10031 పరుగులు చేశారు. ఇందులో 30 సెంచరీలు 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు చేసిన రికార్డ్ రోహిత్ పేరిట ఉంది. ఇక విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 280 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 13027 పరుగులు చేశాడు. ఇందులో 47 సెంచరీలు 65 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అల్ రౌండర్ల జాబితాలో హర్డిక్ పాండ్య కీలకమైన ఆటగాడు. 82 మ్యాచ్ లు ఆడిన పాండ్య 1758 పరుగులు చేసి 11 అర్ధ సెంచరీలను నమోదు చేశాడు.

శుబ్ మన్ గిల్ ఆరంగేట్రం చేసిన తక్కువ టైమ్ లోనే అత్యుత్తమ ప్రదర్శనతో కీలక మైన ఆటగాడిగా మారాడు. 33 మూడు మ్యాచ్ లలో 1917 పరుగులు చేశాడంటే గిల్ ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వీరితో పాటు కే‌ఎల్ రాహుల్, ఇషన్ కిషన్ వంటి వారు సైతం ఉత్తమ ప్రదర్శనతో జట్టులో కీలక ఆటగాళ్ళుగా మారారు. ఇక బౌలర్స్ విషయానికొస్తే… ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్ లో సిరాజ్ నెంబర్ ఒన్ బౌలర్ గా కొనసాగుతున్నారు. అలాగే బుమ్రా సైతం యార్కర్ కింగ్ గా పేరుగాంచి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ను హడలెట్టిస్తున్నాడు. దీంతో ఈసారి వరల్డ్ కప్ లో కెరియర్ ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తుందో చూడాలి.

Also Read:NBK:భగవంత్ కేసరి ఇంటెన్స్ జర్నీ

- Advertisement -