నిహాతో నాకు పెళ్లేంటీ?

199
Sai Dharam Tej rubbishes rumours of marriage with Niharika
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్, చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు కుమార్తె, హీరోయిన్ నిహారికలు ఓ ఇంటివారు కాబోతున్నారు. దీనికి సంబంధించిన వార్త  సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహానికి కుటుంబసభ్యులు ఒప్పుకున్నారన్న వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.  ఈ వార్తలపై సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ తీవ్రంగా స్పందించారు.

నిహారికతో పెళ్లి వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఒకే కుటుంబంలో కలిసిమెలిసి పెరిగామని, అందుకు అన్నా చెల్లెళ్లలా ఉంటామని చెప్పారు. ఇటీవల వచ్చిన వదంతులపై తీవ్రంగా కలత చెందినట్టు చెప్పారు. ఒక అమ్మాయికి సంబంధించిన సున్నితమైన విషయాలను ధ్రువీకరించుకున్నాకే ప్రచురించాలని ఆయన కోరారు. ఆధారం లేని వార్తలు మనోభావాలను దెబ్బతీస్తాయని అన్నారు.

చిరంజీవి సోదరి విజయదుర్గ కుమారుడు సాయి ధరమ్‌ తేజ్‌. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక. వీరిద్దరు వీరిద్దరు వరుసకు బావ,మరదళ్లు. అయితే,తేజు తనకు వరసకు మరదలు అయ్యే అమ్మాయిని చెల్లెలు అనడం సినీజనాలకు షాక్ కు గురిచేసింది.

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, కొన్ని సినిమా వెబ్ సైట్లలోనూ సాయిధరమ్, నిహాల ఫోటోలను వేసి పెళ్లి జరుగబోతున్నట్టు రాశారు. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్ బుక్ లో ఈ ప్రచారం బాగా జరిగింది. తేజు, నీహా ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారని, దీంతో వారిద్దరికి పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారని రాశారు. అందుకే ఈ మెగా హీరో వెంటనే స్పందించి రూమర్లకు చెక్ పెట్టేశారు.

- Advertisement -