ఏ14గా లోకేశ్.. జైలు బాట తప్పదా?

27
- Advertisement -

ఏపీలో ప్రతిపక్ష టీడీపీని స్కామ్ లు వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది. గత కొన్ని రోజులుగా లోకేశ్ అరెస్ట్ పై కూడా తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. స్కిల్ స్కామ్ లో లోకేశ్ పాత్ర కూడా ఉందని ఇంకా ఫైబర్ స్కామ్, ఆవరవతి ఔటర్ రింగ్ రోడ్డు స్కామ్ లలో కూడా లోకేశ్ కీలక సూత్రధారిగా ఉన్నారని ఇలా రకరకాల వార్తలు వినిప్శితున్నాయి. వైసీపీ వాళ్ళు తరచూ ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. .

కాగా తాజాగా ఈ ఆరోపణలు నిజమయ్యేలా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు స్కామ్ లో లోకేశ్ పేరును ఏ14 గా చేర్చింది సిఐడి. దీంతో మరోసారి ఏపీ రాజకీయలు తీవ్ర చర్చనీయంశం అయ్యాయి. స్కిల్ స్కామ్ లో ఉన్న చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తాడో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ములిగే నక్క మీద తాటికాయ పడినట్లు ఇప్పుడు లోకేశ్ ను కూడా స్కామ్ లు చుట్టుముడుతుండడంతో ఆ ఆ పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఒకవేళ లోకేశ్ కూడా అరెస్ట్ అయితే ఎన్నికల ముందు టీడీపీ ఇమేజ్ పూర్తిగా దెబ్బ తినే అవకాశం ఉంది. తాజా పరిస్థితులు చూస్తుంటే లోకేశ్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. ఈ క్షణంలోనైనా లోకేశ్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉందని ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిప్స్తున్నాయి. ఒకవేళ లోకేశ్ కూడా అరెస్ట్ అయితే టీడీపీని ముందుండి నడిపించే నాయకుడుఏ ఎవరనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి ఎన్నికల వేళ టీడీపీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటూ ఉండడం ఆ పార్టీని తీవ్రంగా కలవరపరిచే అంశం.

- Advertisement -