బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా నాలుగో వారంలోకి ఎంట్రీ అయింది. ఇక సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు రతిక రోజ్,టేస్టీ తేజ,ప్రిన్స్ యావర్,ప్రియాంక జైన్,శుభశ్రీ రాయగురు,గౌతమ్ కృష్ణ ఉన్నారు. అయితే ఈ సారి చెత్త రీజన్లతో నామినేట్ చేయడానికి వీలు లేకుండా అవతల కంటెస్టెంట్‌తో పాటు జ్యూరీ మెంబర్స్ కూడా ఒప్పించాలనే ట్విట్ ఇచ్చారు. ఈ జ్యూరీలో సందీప్, శివాజీ, శోభా శెట్టిలు ఉన్నారు.
ఇక అసలు గేమ్ మొదలైంది. కంటెస్టెంట్లు తాము నామినేట్ చేయాలనుకున్న వారిని బోనులో నిల్చోబెట్టి కారణం చెప్పాలి. కంటెస్టెంట్లు చెప్పిన కారణాలు సహేతుకంగా అనిపించకపోతే జ్యూరీ మెంబర్స్ ప్రశ్నిస్తారు. అప్పుడు జ్యూరీని కూడా ఒప్పిస్తేనే ఆ నామినేషన్‌ను స్వీకరిస్తారు. ఈ క్రమంలో శుభశ్రీ తొలుత రతికను నామినేట్ చేసింది. హౌస్‌లో అస్తమానం తన ఎక్స్ బాయ్ ఫ్రెండ టాపిక్ తీసుకువస్తుందని.. ఇక్కడ లేని ఓ వ్యక్తిని, బయట ఉన్న సెలబ్రెటీని గురించి మాట్లాడం బిగ్‌బాస్ రూల్కి విరుద్ధమని చెప్పింది. ఈ కారణంగానే రతికను నామినేట్ చేసింది శుభశ్రీ.
తర్వాత ప్రిన్స్ యావర్.. ప్రియాంక జైన్‌ను నామినేట్ చేశాడు. మూడో పవరాస్త్ర కోసం కంటెండర్లు అవ్వడానికి శోభా శెట్టి-ప్రియాంక జైన్ కలిసి తనను అన్యాయంగా తప్పించారని యావర్ వాదించాడు. వాళ్లిద్దరూ అమ్మాయిలు కావడంతో ఫెమినిజం చూపించి తనను తప్పించారంటూ యావర్ అన్నాడు. మొత్తానికి ఈసారి నామినేషన్ ప్రక్రియ కాస్త వెరైటీగా సాగింది. ఇప్పటివరకు హౌస్ నుండి ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. తొలి వారంలో కిరణ్ రాథోడ్ ,సెకండ్ వీక్‌లో షకీలా,మూడో వారంలో సింగర్ దామిని ఇంటికెళ్లిపోయింది.
Also Read:‘మ్యాడ్’ ..రిలీజ్ డేట్ ఫిక్స్