రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ స్కంద. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఈ ప్రమోషన్స్‌లో రామ్, శ్రీలీల ఇద్దరూ పాల్గొంటున్నారు. తమ పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. రామ్ త్వరలో పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. పెళ్లి పై తనకు మంచి అభిప్రాయం ఉందని.. తాను ఓ ఇంటి వాడిని అవుతాను అంటూ రామ్ కామెంట్స్ చేశాడు.
అన్నట్టు ‘స్కంద’ నుంచి మరో ట్రైలర్ రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా, ఆ ట్రైలర్ ప్రేక్షకుల్ని మెప్పించకపోవడంతో ఇప్పుడు స్కంద టీమ్ మరో ట్రైలర్‌ను రెడీ చేసే పనిలో ఉందట. త్వరలోనే కొత్త ట్రైలర్ రిలీజ్ అయ్యే ఛాన్సుంది. మొత్తానికి ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని రన్ టైమ్ లాక్ చేసుకుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 09 నిమిషాలుగా తెలుస్తోంది.
బోయపాటి గత చిత్రాలతో పోలిస్తే స్కంద రన్ టైమ్ తక్కువనే చెప్పాలి. అన్నట్టు రామ్ తన డబుల్ ఇస్మార్ట్’ పై కూడా ఫుల్ ఫోకస్ పెట్టాడు. రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో ఛార్మీ కౌర్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఇప్పటికే ఓ సాంగ్‌ను హీరోయిన్ కావ్య థాపర్‌తో షూట్ చేశారని తెలుస్తోంది. ఈ సాంగ్ స్పెషల్ సాంగ్ అని సమాచారం.
Also Read:తెలంగాణపై పవన్ ఫోకస్.. ఎలా?