తెలంగాణపై పవన్ ఫోకస్.. ఎలా?

74
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అన్నీ పార్టీల దృష్టి తెలంగాణపై పడింది. ఇప్పటికే అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల రేస్ లో ఉన్నాయి. ఇప్పుడు జనసేన కూడా తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచేందుకు అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో జనసేన పోటీ చేయబోతుందని పవన్ గతంలోనే హింట్ ఇచ్చారు కానీ ఇంతవరకు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు బహిరంగ సభలు గాని నిర్వహించలేదు. ఇక ఎన్నికలు దగ్గర పడడంతో పూర్తి ఫోకస్ తెలంగాణపై ఉండేలా పవన్ ప్రణాళికలు రెడీ చేసుకున్నారట. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ 32 స్థానాల్లో బరిలో దించాలని పవన్ వ్యూహాలు రచిస్తున్నారట.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి అసలు తెలంగాణలో పవన్ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే ఏపీలో బీజేపీ, టీడీపీ పార్టీలతో జనసేన పొత్తులో ఉంది. అటు తెలంగాణలో కూడా ఈ రెండు పార్టీలో పోటీ చేస్తున్నాయి. మరి తెలంగాణలో కూడా ఈ పొత్తు కొనసాగుతుందా అనేది విశ్లేషకులు లేవనెత్తుతున్న ప్రశ్న. అయితే తెలంగాణలో జనసేనతో పొత్తు లేదని బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. కానీ అప్పుడు జనసేన తెలంగాణలో పోటీపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో పోటీకి పవన్ ఆసక్తి చూపుతున్నారు. మరి ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉంటుందా అనేది చూడాలి. ఇక ఇటీవల ఏపీలో టీడీపీ తో కూడా పొత్తు ప్రకటించారు పవన్ కల్యాణ్. ఆ పార్టీ కూడా తెలంగాణ ఎన్నికల బరిలో ఉంది. దీంతో టీడీపీ విషయంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ప్రశ్నార్థకమే. మొత్తానికి తెలంగాణ ఎన్నికల విషయంలో పవన్ స్టాండ్ అస్థిరంగా ఉందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.

Also Read:టీడీపీలోకి జూ.ఎన్టీఆర్.. కష్టమే ?

- Advertisement -